వివాహిత బలవన్మరణం | woman Hanging | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Published Mon, Aug 22 2016 11:15 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వివాహిత బలవన్మరణం - Sakshi

వివాహిత బలవన్మరణం

భర్తతో మనస్పర్థలు.. తరచూ గొడవలతో విసిగి వేసారిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కామారుపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు..

శింగనమలకు చెందిన మహాలక్ష్మి (28)కి అనంతపురం మండలం కామారుపల్లికి చెందిన పాల వ్యాపారి సుబ్బరాయుడుతో ఏడేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమార్తె భవిత, కుమారుడు కుమార్‌ ఉన్నారు. ప్రారంభంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతి చిన్న విషయానికీ గొడవపడేవారు. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది.

పెద్దమనుషులు రాజీ చేసి మళ్లీ భర్త వద్దకు పంపారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాక.. మహాలక్ష్మి ఫ్యానుకు ఉరి వేసుకుంది. కొద్దిసేపటి అనంతరం తిరిగి వచ్చిన సుబ్బరాయుడు ఉరికి వేలాడుతున్న భార్యను చూసి హుటాహుటిన సర్వజనాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ జగదీష్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement