నవవధువు ఆత్మహత్య | New bride suicide | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్య

Published Mon, Oct 26 2015 3:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

New bride suicide

వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. ఈ సంఘటన విశాఖ జిల్లా చినగడిలి మండలం సంతపాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుక్కచంటి(30)కి లక్ష్మి(25)తో ఆర్నెళ్ల కిందట వివాహమైంది.

అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అత్తింటి వారే తమ బిడ్డను చంపి ఆత్మహత్యగా చిత్రీక రిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement