ఉరివేసుకుని వివాహిత మృతి | Married hung himself to death | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వివాహిత మృతి

Published Sat, Sep 26 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

ఉరివేసుకుని వివాహిత మృతి

ఉరివేసుకుని వివాహిత మృతి

కోడూరు : వివాహమై నాలుగు నెలలు కూడా గడవకముందే ఒక వివాహిత అత్తవారింట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన సూరం హరినాథం, కృష్ణకుమారిల కుమార్తె రాజ్యలక్ష్మి(24)కి కోడూరు శివారు యర్రారెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన పోతుల రామాంజనేయులు కుమారుడు సురేష్‌తో ఈ ఏడాది మే 27న వివాహమైంది. సురేష్ మచిలీపట్నం గొడుగుపేటలోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజ్యలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతోంది. అత్తమామలు పొలంపనుల నుంచి వచ్చిచూసే సరికి రాజ్యలక్ష్మి మృతి చెందింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై వై.సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతురాలి బంధువులు ఇంకారావాల్సి ఉందని మృతికి గల కారణాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement