Rajya Lakshmi
-
పోలవరం సమన్వయకర్తగా తెల్లం రాజ్యలక్ష్మి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తెల్లం రాజ్యలక్ష్మిని నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ 27 మంది సమన్వయకర్తలతో విడుదల చేసిన జాబితాలో ఆమెకు స్ధానం దక్కింది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణిగా, ప్రభుత్వ టీచర్‌గా రాజ్యలక్ష్మి నియోజకవర్గమంతా సుపరిచితం. 2024 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తారని ప్రకటించారు. బీఏ, బీఈడీ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి 24 ఏళ్లకే టీచర్‌గా విధుల్లోకి చేరారు. 23 ఏళ్ళుగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో నియోజకవర్గంలో ప్రధాన అంశాలపై సమగ్ర అవగాహనతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బాలరాజు గెలుపులోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకుని రాజ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే బాలరాజు ఇంటికి చేరుకుని ఎమ్మెల్యే దంపతులను అభినందించారు. ప్రస్తుతం రాజ్యలక్ష్మి బుట్టాయగూడెం మండలం దొరమామిడి ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రాజ్యలక్ష్మి బయోడేటా భర్త పేరు: తెల్లం బాలరాజు (ఎమ్మెల్యే పోలవరం) వయస్సు: 47 విద్యార్హత: బీఏ–బీఈడీ వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయిని పనిచేస్తున్న స్కూల్: బుట్టాయగూడెం మండలం దొరమామిడి ఎంపీయూపీ స్కూల్ పిల్లలు: ఇద్దరు కుమారులు గ్రామం: బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు -
సీనియర్ నటి రాజ్యలక్ష్మి తనయుడు హీరోగా ఎంట్రీ
రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పల్లెగూటికి పండగొచ్చింది’. తిరుమల్ రావు దర్శకత్వం వహించారు. కె.ప్రవీణ్ సమర్పణలో కె.లక్ష్మి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. తిరుమల్ రావు మాట్లాడుతూ– ‘‘గ్రామీణ యువత ఏ రకంగా చెడు మార్గంలో వెళుతున్నారు? వారు మంచి మార్గంలో నడిస్తే ప్రభుత్వ సహకారం లేకుండానే గ్రామాన్ని ఎలా స్మార్ట్‌గా అభివృద్ధి చేయొచ్చన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మా అబ్బాయి రోహిత్ కృష్ణ హీరోగా నటించాడు. ఫిబ్రవరిలో రిలీజ్‌కి ప్లాన్ చేశాం’’ అన్నారు రాజ్యలక్ష్మీ . ‘‘సుమన్, సాయి కుమార్, సాయాజీ షిండే, రఘుబాబు, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులతో నటించే అవకాశం కల్పించిన తిరుమల్ రావుకు «థ్యాంక్స్’’అన్నారు రోహిత్ కృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: సింధు కే ప్రసాద్, కెమెరా: రవి టి. -
ఘోరం: అందరూ చూస్తుండగానే...
సాక్షి, విజయనగరం క్రైమ్: శనివారం మధ్యాహ్నం... సమయం 12.45 గంటలు కావస్తోంది. ప్రయాణికులంతా ఎదురుగా వస్తున్న రైలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు రానే వచ్చింది. స్టేషన్లోకి వస్తుండగానే ఓ యువతి పట్టాలపై పరుగులు తీస్తోంది. అక్కడున్న ప్రతీ ఒక్కరూ కేకలు వేస్తున్నప్పటికీ ఎవరి గాభరాలో వాళ్లున్నారు. ఆ యువతి రైలుకు ఎదురుగా పట్టాలపై పడుకుండిపోయింది. అంతే రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఆమె మృత్యువాత పడింది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నానికి చెందిన అంకంరెడ్డి రాజ్యలక్ష్మి(26) స్థానిక విజయనగరం రైల్వేస్టేషన్ మూడో నంబర్ ఫ్లాట్‌ఫాంలో కూర్చుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ అనౌన్స్మెంట్ విని నాల్గో నెంబర్ ప్లాట్‌ఫాంలోకి వెళ్లింది. అక్కడ కూర్చున్న ఆమె రైలు స్టేషన్లోకి రావడం గమనించింది. అంతే అందరూ చూస్తుండగానే పరుగులు తీసింది. ప్రయాణికులు, హమాలీలు కేకలు వేస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె విశాఖ సచివాలయంలో వెల్పేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మి నర్సీపట్నంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతురాలి చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఆమెకు వ్యక్తిగత సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ చేపట్టామని జీఆర్పీ ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: (స్నేహ అబ్బాయిలతో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని) -
మూడు వేల పున్నములు
తుర్లపాటి పద్మావతి 86 ఏళ్లు. అడిదం బాలాత్రిపుర సుందర స్వరాజ్య రాజ్యలక్ష్మి 88 ఏళ్లు. మల్లంపల్లి రమా జయలక్ష్మి 90 ఏళ్లు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లకు వీరి కుటుంబ సభ్యులు ఈ నెల 15న విజయవాడలో ‘సహస్ర చంద్ర దర్శన వేడుక’ జరుపుతున్నారు. సహస్ర చంద్ర దర్శనం అంటే.. వెయ్యి పున్నములను చూసిన వయసును కలిగి ఉండటం. ముగ్గురు కాబట్టి మూడు వేల పున్నముల సంబరం ఇది!! ఈ సందర్భంగా వీరిని ‘సాక్షి’ పలకరించింది. మల్లంపల్లి రమా జయలక్ష్మి అన్నయ్య తరవాత మేం ఎనిమిది మంది ఆడపిల్లలం. మా చిన్నప్పుడే నాన్నగారు పోయారు. నేను ఐదో అమ్మాయిని. మా పెద్దక్కయ్య పెళ్లి అయిన కొత్తల్లోనే అన్నయ్య కన్ను మూయడంతో, నా మీద కుటుంబ బాధ్యత పడింది. నేను ఎస్ఎస్ఎల్సి చదివాను. టైప్ నేర్చుకుని, ఉద్యోగంలో చేరాను. ఇంటి బాధ్యతల కారణంగా నేను పెళ్లి చేసుకోలేదు. నాలుగో బావగారు నన్ను పిడబ్లు్యడి ఆఫీసులో టైపిస్టుగా చేర్పించారు. అక్కడ నేను ఒక్కర్తినే అమ్మాయిని. సూపరింటెండెంట్ పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగి, ఆ పదవిలోనే రిటైర్ అయ్యాను. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాను. సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమం గురించి విన్నాను కాని, ఎన్నడూ చూడలేదు. మా చెల్లెలి కొడుకు ఇలాంటి కార్యక్రమం మా ముగ్గురికి కలిపి చేయడం చాలా సంతోషంగాను, ఆశ్చర్యంగానూ ఉంది. ఎలా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. మా తరంలో మేం ముగ్గురమే మిగిలాం. కుటుంబాలు పూర్వపు పద్ధతిలో ఉంటేనే బాగుంటుంది. అలా ఉండటం వల్లే ఈ రోజు మాకు ఈ పండుగ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. తుర్లపాటి పద్మావతి ఏలూరులో గవర్నమెంటు స్కూల్లో చదువుకున్నాను. స్నేహితులతో స్కిప్పింగ్, త్రోబాల్ ఆడేదాన్ని. మేం అందరం ఆడపిల్లలమే అయినా నాన్నగారు ఎన్నడూ విసుక్కునేవారు కాదు. బాల్యమంతా చాలా సంతోషంగా, యాక్టివ్‌గా గడిచింది. స్కూల్లోనే కోలాటాలు, గొబ్బి పాటలు అన్నీ నేర్చుకునేవాళ్లం. చిన్నప్పడు అక్కచెల్లెళ్లు కొట్టుకోవడం సహజమే కదా. ఇప్పుడు ఈ పండుగలాంటి కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మేం కలలో కూడా ఊహించని వేడుక. మా అక్కయ్య కొడుకు చేస్తున్నాడు. పెళ్లయ్యాక సంసారం బాధ్యతలు, అత్తగారు, మావగారు, ఆడపడుచులు.. ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించడం, కష్టసుఖాలు పంచుకోవడం... ఉమ్మడి కుటుంబంలో అలవాటయ్యాయి. ఇప్పుడే పండుగ జరగబోతోందంటే ఆనందంతో నా కళ్లు చెమరుస్తున్నాయి అడిదం స్వరాజ్య రాజ్యలక్ష్మి మా అబ్బాయి మాకు సహస్ర పూర్ణ చంద్ర దర్శన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు మా పెద్దక్కయ్య పెద్ద కొడుక్కి జరిగినప్పుడు ఈ కార్యక్రమం చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మాకు జరుగుతోంది కాబట్టి ఆనందంగా ఉంది. మా అక్కచెల్లెళ్ల మధ్యన ఉండే అనుబంధం కారణంగానే మా అబ్బాయి మా వాళ్లను కూడా కన్నతల్లిలాగే చూసుకుంటాడు. ఈ విధంగా ముగ్గురికి ఒకేసారి ఈ పండుగ బహుశా.. అరుదుగా జరుగుతుందేమో. సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: విజయకృష్ణ, సాక్షి, విజయవాడ ముగ్గురమ్మలు ముగ్గురు అమ్మలకు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటినుండి ఉమ్మడి కుటుంబాలలో పెరగటం, కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చిన్నప్పటి నుండి అనుభవించటం, ఆ సమయంలో అమ్మ కష్టపడి కుటుంబాన్ని నడిపించటం... ఈ కారణాలన్నిటితో పెద్దల మంచి చెడులు చూడాలన్న తపన నాలో కలిగింది. వాళ్ల సంతోషమే నా సంతోషం. వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం, పసి పిల్లల కళ్లల్లో ఆనందం ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్లే నాకు పిల్లలు. అడిదం కృష్ణమోహన్ (అడిదం రాజ్యలక్ష్మి కుమారుడు) -
నేనున్నాను నేనుంటాను
‘అయామ్.. ఐ విల్’. ఇదీ ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్ డే నినాదం. మరో రెండేళ్ల పాటు ఇదే నినాదంతో క్యాన్సర్ డే కార్యక్రమాలు ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తాయి. అయితే యు.ఎస్.లో ఉంటున్న రాజ్యలక్ష్మి దంపతులు గత ఐదేళ్లుగా ఇదే నినాదంతో.. ‘నేనున్నాను.. నేనుంటాను’ అంటూ క్యాన్సర్ పేషెంట్లకు భరోసా ఇవ్వడంతో పాటుఆర్థికంగా తోడ్పాటునిస్తున్నారు. ‘‘మేడమ్! మెడిసిన్స్ స్టాక్ తగ్గుతోంది. మరికొంత పంపిస్తారా’’ హోల్‌సేల్ డ్రగ్గిస్ట్ మాధవి నుంచి ఫోన్.‘‘అలాగే మాధవీ! ఈ నెల ఎక్కువ అవసరం పడ్డాయా? సరే, అరేంజ్ చేస్తాను’’ బదులిచ్చారు రాజ్యలక్ష్మి. వెంటనే మందుల తయారీ కంపెనీకి ఫోన్ చేసి తనకు కావాల్సిన మెడిసిన్స్ ఇండెంట్ చెప్పారామె. ఇంతలో మరో ఫోన్... డాక్టర్ నుంచి. ‘‘మేడమ్! ఈ నెల ఎక్కువ మందిని రిఫర్ చేశాను. అంత అవసరం ఏర్పడింది.’’‘‘ఫర్వాలేదు డాక్టర్ గారూ, ఎంతమంది వచ్చినా పంపించండి’’ భరోసా ఇచ్చారు రాజ్యలక్ష్మి.‘‘అంతకు ముందు మందులు కొనుక్కోలేని పేషెంట్లను చూసి ఓ క్షణం బాధపడి, తర్వాత మర్చిపోయేవాళ్లం. ఇప్పుడు పేషెంట్లకు ధైర్యం చెప్పి మీరు అరేంజ్ చేసిన డీలర్ దగ్గరకు పంపిస్తున్నాం. ఇది మీతో ప్రతిసారీ చెప్తున్న మాటే అయినా మళ్లీ మళ్లీ చెప్పాలనిపిస్తోంది. మందులు సబ్సిడీ ధరల్లో దొరుకుతాయని చెప్పినప్పుడు, అసలే కొనలేని వాళ్లకు ఉచితంగా ఇస్తారని చెప్పినప్పుడు పేషెంట్ కళ్లలో కనిపించే సంతోషం ఇంత అని మాటల్లో చెప్పలేను. వ్యాధి నయం అయినట్లే రిలీఫ్ పొందుతుంటారు. వాళ్లందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు’’ అన్నారు ఆ డాక్టర్.‘‘చేస్తున్నది నేను కాదు డాక్టర్ గారూ, ఆ భగవానుడే నా చేత చేయిస్తున్నాడు. సేవ అవసరం నాకు తెలియడానికే నాకు వ్యాధిని ఇచ్చి, వ్యాధిని తగ్గించి, మళ్లీ జీవితాన్నిచ్చినట్లున్నాడు. ఇకపై ఈ జీవితం అభాగ్యుల సేవకోసమే. నాకొక్కదానికే ఈ బాధ తెలిస్తే చాలదనుకున్నాడేమో ఆ భగవంతుడు. నాతో పాటు, నా భర్తనూ క్యాన్సర్ బారిన పడేసి, తిరిగి మమ్మల్ని మామూలు మనుషులను చేశాడు. ఖరీదైన క్యాన్సర్ మందులు కొనుక్కోలేని వాళ్లకు సహాయం చేయడానికి డబ్బును కూడా ఆ భగవంతుడే సమకూర్చాడు. ఆ భగవంతుడిచ్చిన డబ్బును అవసరమైన వాళ్లకు చేరుస్తున్న చేతులు మాత్రమే ఇవి’’ అన్నారు రాజ్యలక్ష్మి మృదువుగా. నిజమే.. ఆమె ఎప్పుడూ తాను సహాయం చేస్తున్నానని చెప్పరు. తాను నమ్మే భగవానుడే చేయిస్తున్నాడంటారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే (గివింగ్ బ్యాక్ టు సొసైటీ) సంకల్పం తనలో కలగడం కూడా ఆ భగవానుని ప్రేరణేనంటారామె. ‘మణీస్ కేఫ్’ వాళ్లమ్మాయి రాజ్యలక్ష్మి ప్లాంజెరీ పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో. అప్పట్లో ప్రసిద్ధి చెందిన మణీస్ కేఫ్ వాళ్లమ్మాయి. తమిళనాడు నుంచి వచ్చి కావలిలో స్థిరపడిన తమిళ కుటుంబం వారిది. కావలిలో న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టిన రాజ్యలక్ష్మికి నెల్లూరు కోమల విలాస్ వాళ్లబ్బాయి శంకర్‌నారాయణతో వివాహమైంది. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు వాళ్లు. ఆమె హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు కూడా. భర్తకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె ప్రయాణానికి గమ్యం కూడా అమెరికానే అయింది. ప్లాంజెరీ అనేది తమిళనాడులో శంకర్‌నారాయణ పూర్వికుల గ్రామం. ఆ ఊరి పేరే ఇంటిపేరుగా అమెరికాలో స్థిరపడ్డారు వాళ్లు. ఆ సంగతులను యు.ఎస్.నుంచి ‘సాక్షి’తో పంచుకున్నారు రాజ్యలక్ష్మి ప్లాంజెరీ. డాలర్ ఆరు రూపాయల కాలం ‘‘మేము అమెరికా వెళ్లినప్పుడు ఒక డాలర్ ఆరు రూపాయలు. జీవించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి మా వారి జీతం సరిపోయేది. మాకు తొలిబిడ్డ అమ్మాయి. ఇంటి వెలుగు అని మురిసిపోయేలోపు పిడుగులాంటి నిజం. పాపాయి స్పెషల్లీ చాలెంజ్డ్ చైల్డ్! వైద్యం చేయించడానికి జీతం సరిపోయేది కాదు. బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఎనిమిదేళ్లపాటు పోరాటం చేశాం. మన బంధం ఇంతటితో తీరిపోయిందని చెప్పకుండానే మమ్మల్ని విడిచివెళ్లిపోయింది శారద (పాపాయి పేరు). ఆ ఇంట్లో ఉండబుద్ధయ్యేది కాదు. ఎటైనా వెళ్లిపోవాలనిపించేది. తర్వాత పుట్టిన బాబు పనుల్లో మునిగిపోతున్నా కూడా నాకు పాప గుర్తుకొస్తుండేది. ‘మీ డెస్టినేషన్ ఇది’ అని మా వారికి కొరియాలో ఉద్యోగం చూపించాడు భగవంతుడు. కొరియాకు వెళ్లిన తర్వాత కూడా నేను మామూలు మనిషి కాలేకపోయాను. ఊహలకు తప్ప మాటలకు లేని పాపాయి తరచూ గుర్తుకు వస్తుండేది. కొరియాలో సత్య సాయిబాబా స్పిరిచ్యువల్ గ్యాదరింగ్స్ జరిగేవి. ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి పట్టుకుని మరీ ఆహ్వానించేవాళ్లు. ఆధ్యాత్మిక సత్సంగాల్లో సాంత్వన దొరికింది. ఆ సత్సంగాలు మా జీవిత గమనాన్నే మార్చేశాయి. సత్యసాయి రప్పించారు యు.ఎస్.నుంచి ఏటా సాయిబాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చేవాళ్లం. ఓసారి బాబా మా వారితో ‘ఇప్పటి వరకు సమాజం నుంచి తీసుకున్నావు. ఇక సమాజానికి చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ నువ్వు చేయాల్సిందంతా పూర్తి చేయి’ అన్నారు. ఆ మాటతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాం. సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలైంది. మొదటగా ఇచ్చింది ప్రభుత్వానికే. ఎన్ఆర్ఐకి ఇచ్చే టాక్స్ మినహాయింపును తీసుకోకుండా పూర్తి ట్యాక్స్ కట్టారాయన. అమెరికాలో ఆయన చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌తో ఆదుకున్న ఐవోడబ్లు్యఎ యూనివర్సిటీలో ఏటా మూడు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మా పాపకు స్పెషల్ ట్రీట్మెంట్, ట్రైనింగ్ ఇప్పించడానికి అప్పట్లో మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. యుఎస్‌లోని రే గ్రాహమ్ అసోసియేషన్ మాకు హెల్ప్ చేసింది. ఆ చారిటీకి మా పాప శారదాదేవి పేరుతో ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాం. శారద మెమోరియల్‌తో స్పెషల్లీ చాలెంజ్డ్ కిడ్స్‌కి అవసరమైన సర్వీస్ ఇస్తూ ఉంటే శారద మాకు లేదని అనిపించదు. అప్పటికే ఫోర్త్ స్టేజ్! ఆ భగవంతుడు మా చేత... విద్యకు, స్పెషల్ కిడ్స్‌కే కాదు, వైద్యరంగానికీ సేవ చేయించాలనుకున్నాడో ఏమో తెలియదు. మా భార్యాభర్తలిద్దరినీ మూడు నెలల తేడాతో క్యాన్సర్ బారిన పడేశాడు, ఆనక బతికించాడు. 2011లో మా అబ్బాయికి పెళ్లి చేశాం. ‘అరవై నిండాయి, బాధ్యతల నుంచి రిటైరయ్యాం’ అనుకునే లోపు ఆ ఏడాది ఆగస్టులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడింది. అప్పటికే ఫోర్త్ స్టేజ్. మూడు నెలలే అన్నారు డాక్టర్లు. నాకు వైద్యం మొదలైంది. ఆ ఏడాది డిసెంబర్లో మా వారికి స్టమక్ క్యాన్సర్ బయటపడింది. ఇద్దరమూ ట్రీట్మెంట్ తీసుకున్నాం. నాకు మందులతోనే తగ్గిపోయింది. ఇద్దరం కోలుకున్న తర్వాత క్యాన్సర్ నివారణకు ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్‌కి మావంతుగా తిరిగి ఇవ్వాలనిపించింది. హ్యూస్టన్‌లోని ఎండిఎ రీసెర్చ్‌కి, ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో హోమియో మెడిసిన్ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌కి మా వంతు సాయం చేస్తున్నాం. ఇండియాలో నేరుగా పేషెంట్‌కే సహాయం చేస్తున్నాం. ఏడాదిలో సగం కాలం అమెరికాలో ఉంటాం. అందుకే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లను కలిసి మేము చేయదలుచుకున్నది చెప్పాం. మాధవి అనే హోల్‌సేల్ డీలర్‌తో అనుసంధానం అయ్యాం. ఎనభై వేలు, లక్ష రూపాయలు ఉండే ఇంజక్షన్లను వేయించుకోలేని వాళ్లకు మేము ఆసరా అవుతున్నాం. పేషెంట్లు వాళ్లు భరించగలిగినంత ఖర్చును వాళ్లు భరిస్తారు, మిగిలిన డబ్బు మేమిస్తాం. ఒక్కొక్కరు నలభై వేలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఐదు–పది వేలకు మించి భరించలేమంటారు. అసలే ఆధారమూ లేని వాళ్లకు ఫ్రీగా ఇస్తున్నాం. తల్లిగా, గృహిణిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. ఇప్పుడు సోషల్ వర్క్‌లో ఉన్న సంతృప్తిని ఆస్వాదిస్తున్నాను. ఈ జీవితం ఇక సమాజానికి తిరిగి ఇవ్వడానికే. ఏటా ఇంత మొత్తం చదువులకు, ఇంత మొత్తం వైద్యానికి, ఇంత మొత్తం స్పెషల్ కిడ్స్‌కి, ఇంత మా ఇద్దరి మెయింటెనెన్స్‌కి అని విభజించుకుని ఖర్చు చేస్తున్నాం. మా అబ్బాయి ఇక్కడే అమెరికాలో తన ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మేము సంపాదించుకున్నదంతా ఇక సమాజసేవకే అంకితం’’ అన్నారు రాజ్యలక్ష్మి. – వాకా మంజులారెడ్డి భయం వద్దు.. ధైర్యం పెంచుకోవాలి నాకు సర్జరీ చేయాల్సిందేనన్నారు డాక్టర్లు. అయితే దేవుడి రూపంలో డాక్టర్ సెంథిల్ ‘మందులతో తగ్గుతుందేమో ప్రయత్నం చేద్దాం’ అన్నారు. మందులు వేసుకుంటూ రోజూ ప్రాణాయామం చేశాను. పచ్చటి చెట్టు కింద కూర్చుని ఉదయం పది నిమిషాలు, మధ్యాహ్నం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు ప్రాణాయామం చేస్తే తగినంత ఆక్సిజెన్ అందుతుంది. దేహం తనను తానే తిరిగి ఆరోగ్యవంతం చేసుకుంటుంది. ఒంటికి రోజూ సూర్యరశ్మి తగలాలి. జీవనశైలిని ఆక్సిజెన్ రిచ్‌గా ఉండేలా చూసుకోవాలి. వైఫై ఎన్విరాన్మెంట్ను తగ్గించుకోవాలి. ముఖ్యంగా బిడ్డల్ని కనాల్సిన వయసులో ఉన్న అమ్మాయిలు మంచి ఆహారం, మంచి గాలిలో జీవించాలి. చేతిలో ఆరోగ్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత ఆరోగ్యం కోసం వెంపర్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దనేది నా సూచన. ఇక క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు చెప్పే మాట ఒకటే.. ఇప్పుడు మంచి మందులున్నాయి. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషిగా మనం చేయాల్సింది. నేను భగవంతుడిలో ధైర్యాన్ని వెతుక్కున్నాను. వేద పఠనం ఓ శక్తి తరంగం మోడరన్ లైఫ్స్టయిల్లో క్యాన్సర్ 35 ఏళ్లకే దాడి చేస్తోంది. బయట నూనెలో వేయించిన ఆహారం, సెల్‌ఫోన్ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మాది చాలా డిసిప్లిన్డ్ లైఫ్‌స్టయిలే అయినా, హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో మా ఇంటి దగ్గరలో ఉన్న సెల్ టవర్లే క్యాన్సర్ బారిన పడేశాయి. వేదం, రుద్రం, పంచసూక్త పఠనం చేస్తాను. ఆ వైబ్రేషన్స్ ఒట్టి శబ్ద తరంగాలు కాదు, శక్తి తరంగాలు. మనిషిని ఆరోగ్యవంతం చేస్తాయి. మామూలు వ్యక్తుల్లాగే అన్ని పనులూ చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – శంకర్‌నారాయణ ప్లాంజెరీ, -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం..
►మూడు రోజులుగా యువతి దీక్ష ►రేఖవానిపాలెంలో నిరసన తగరపువలస (భీమిలి): తాను ప్రేమించిన యువకునితో పెళ్లి జరిపించాలని కోరుతూ భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ గ్రామంలో మూడురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాజ్యలక్ష్మి ఉదంతం గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన నూకవరపు రాజ్యలక్ష్మికి కాకినాడకు చెందిన రాంజీ అనే యువకునితో ఏడాది క్రితం భీమిలిలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సుముఖంగా లేకపోవడంతో రాజ్యలక్ష్మి 20 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో భీమిలి పోలీసులు ఈ నెల 3వ తేదీన రాంజీపై కేసు నమోదు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాంజీ రేఖవానిపాలెంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. విషయం తెలిసిన రాజ్యలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఆ యువకుడు గానీ, అతని బంధువులు గానీ స్పందించలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి ఆమె గ్రామంలోనే నిరసన చేపట్టింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో విలేకరులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మికి స్థానికులు ఆశ్రయం కల్పించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. -
పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ క్లాస్ రూమ్ పైకప్పు ఊడిపడి ఒక బాలిక గాయపడింది. మంగళవారం ఉదయం తరగతి గ దిలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. దాంతో విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ త్వరలో తరగతి గదులకు మరమ్మతు చేస్తామని చెప్పారు. -
డిసెంబర్ 18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు రాజ్యలక్ష్మి (నటి), స్నేహా ఉల్లాల్ (హీరోయిన్) ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కుజసంబంధమైనది కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి, పోలీసు, మిలిటరీ రంగాలలో ఉద్యోగాలు సంపాదిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. భూ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గత సంవత్సరం ప్రారంభించిన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందాన్ని, మంచి ఊహాశక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కొనసాగించడం మంచిది. అలాగే స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. లక్కీ డేస్: 1,3,5,6,8, 9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు. సూచనలు: మాట లు, చేతలలో సంయమనం పాటించడం, దుర్గాదేవిని పూజించడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం, రక్తదానం, శివుడికి అభిషేకం చేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఉరివేసుకుని వివాహిత మృతి
కోడూరు : వివాహమై నాలుగు నెలలు కూడా గడవకముందే ఒక వివాహిత అత్తవారింట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన సూరం హరినాథం, కృష్ణకుమారిల కుమార్తె రాజ్యలక్ష్మి(24)కి కోడూరు శివారు యర్రారెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన పోతుల రామాంజనేయులు కుమారుడు సురేష్‌తో ఈ ఏడాది మే 27న వివాహమైంది. సురేష్ మచిలీపట్నం గొడుగుపేటలోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజ్యలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతోంది. అత్తమామలు పొలంపనుల నుంచి వచ్చిచూసే సరికి రాజ్యలక్ష్మి మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై వై.సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతురాలి బంధువులు ఇంకారావాల్సి ఉందని మృతికి గల కారణాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
నిందితులు నలుగురూ యువతీయువకులే {పేమ, ఆర్థిక వ్యవహారాలే కారణం భీమడోలు : ఓ యువకుడిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను శుక్రవారం రాత్రి భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మండలంలోని ఆగడాలలంక గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల వినయ్సుధీర్ (28)ను జూలై 12న పోలసానిపల్లి పేరయ్యకోనేరు చెరువు వద్ద హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసు వివరాలను భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ విలేకరులకు తెలిపారు. ఆర్థిక పరమైన, ప్రేమ వ్యవహారాలే హత్యకు కారణమని ఆయన సృష్టం చేశారు. రాజమండ్రిలోని కొంతమూరుకు చెందిన అన్నాచెల్లెళ్లు లింగంపల్లి రమేష్ (22), లింగంపల్లి సునీత (19)తో పాటు కొవ్వలి సురేంద్ర (22), కుమారి రాజ్యలక్ష్మి పథకం ప్రకారం యాళ్ల వినయ్సుధీర్ను కాళ్లు కట్టి కర్రలతో కొట్టి అతికిరాతకంగా చంపారన్నారు. వినయ్సుధీర్కు కొంతకాలం క్రితం ఓ రాంగ్ కాల్ చేయడంతో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన లింగంపల్లి సునీత పరిచయమైందన్నారు. వారిద్దరి ఫోన్ పరిచయం ప్రేమగా మారింది. ఈతరుణంలోనే రెండేళ్ల క్రితం లింగంపల్లి సునీత కుటుంబం రాజమండ్రి మకాం మారింది. సునీత, సుధీర్ మధ్య సంబంధం కొనసాగింది. వీరిద్దరూ తరుచుగా పోలసానిపల్లిలో కలిసేవారు. వినయ్ సుధీర్ సునీత వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇదిలావుండగా అదే గ్రామంలో ఉంటున్న సునీత ద్వారా రాజ్యలక్ష్మి అనే మహిళ సుధీర్‌కు పరిచయమైంది. రాజ్యలక్ష్మి నుంచి కూడా సుధీర్ కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. సునీత తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. పెళ్లి విషయాన్ని సుధీర్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం గత నెల 12న సాయంత్రం సునీత సుధీర్‌కు ఫోన్‌చేసి పోలసానిపల్లి రమ్మంది. ఆమె స్కూటర్‌పై అక్కడికి వెళ్లగా, మిగిలిన ముగ్గురు కొంతమూరు నుంచి ఆటోలో వచ్చారు. బైక్‌పై వచ్చిన సుధీర్‌తో సునీత మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు కర్రలతో సుధీర్ మర్మాంగంపై కొట్టారు. కాళ్లు కట్టేశారు. అనంతరం హతమార్చి వెళ్లిపోయారు. నిందితుడు లింగంపల్లి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ సుధీర్‌ను భయపెట్టాలకున్నామే తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదన్నాడు. విలేకరుల సమావేశంలో సమావేశంలో ఎస్సైలు బి.వెంకటేశ్వరరావు (భీమడోలు), సీహెచ్ సతీష్‌కుమార్ (ద్వారకాతిరుమల), ఎం.సుభాష్ (దెందులూరు), హెచ్‌సీ అమీర్ పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ’ల్లో అక్రమాలు జరిగితే చర్యలు
- ఐసీడీఎస్ జిల్లా పీడీ రాజ్యలక్ష్మి - తాండూరు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సంబంధిత కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలోని ఐసీడీఏస్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.... జిల్లా వ్యాప్తంగా 2793 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయని,గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సంబంధిత కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లోని సపోటింగ్,మానిటరింగ్ కమిటీ సభ్యులు అంగన్వాడీ కేంద్రాలను పర్యవే క్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచులకు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 1625 కేంద్రాలను తనిఖీ చేశామని...త్వరలో అన్ని ప్రాజెక్టుల్లోని కేంద్రాలను తనిఖీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గ ర్భిణులకు గుడ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బాలామృతం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. కొందరు దంపతులు ఆడపిల్లలను విక్రయిస్తున్నారని...ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని సూచించారు. త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం అందజేస్తామన్నారు. సమావేశంలో తాండూరు సీడీపీఓ వెంకట్‌లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.5 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్
సత్యవేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా సత్యవేడులో రాజ్యలక్ష్మి అనే చిట్టీల వ్యాపారి కోటిన్నర రూపాయలతో పరారైంది. బాధితుల కథనమిదీ.. పదేళ్లుగా రాజ్యలక్ష్మి తానప్ప మొదలి వీధిలో నివసిస్తూ చిట్టీల వ్యాపారం చేస్తోంది. పంచాయతీ పరిధిలో అందరికీ నమ్మకం కలిగేలా చిట్టీ డబ్బులు అందజేస్తోంది. అయితే, వారం రోజులుగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంటోంది. దీంతో చిట్టీలు కట్టిన సుమారు 200 మంది మహిళలు బుధవారం ఆరాతీయగా వారం రోజులుగా స్థానికంగా లేదని తేలింది. బెంగళూరు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో వారంతా సత్యవేడు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నా భర్త నాకు కావాలి
అత్తవారింటి ముందు బైఠాయించిన వివాహిత గుంటూరు రూరల్ : ఓ వివాహితను అత్తింటి వారు కొట్టి ఇంట్లో నుంచి గెంటెయ్యడంతో గత నాలుగు రోజులుగా అత్తింటి ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు ప్రాంత పరిధిలోని గాజులవారి వీధికి చెందిన రాజ్యలక్ష్మికి గుంటూరు పాతగుంటూరు బాలాజీనగర్ 8వ లైన్‌కు చెందిన కేదారి సతీష్‌తో పెద్దల సమక్షంలో 2008 ఆగస్టు 24న వివాహం జరిగింది. సతీష్ అదే ప్రాంతంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహించేవాడు. రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటుంది. వివాహానంతరం భార్య, భర్తలు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మూడు నెలల తరువాత భర్త సతీష్ అన్న కేదారి రమేష్ నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులైన సాంబశివరావు, భిక్షావతిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో సతీష్ గుంటూరులోని తల్లి దండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి సతీష్ పాతగుంటూరులో ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ ఉండగా, భార్య రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోనే ఉంటోంది. భర్త సతీష్ హైదరాబాద్‌కు వచ్చి వెళుతుండేవాడు. ఆరు నెలల క్రితం భర్తకు ఫోన్‌చేయగా, తాను ఇక హైదరాబాద్ రానని, తనకు విడాకులు కావాలని అనడంతో అవాక్కయింది. ఈ క్రమంలోనే తన భార్య కాపురానికి రావడం లేదంటూ సతీష్ కోర్టు ద్వారా నోటీసును పంపించాడు. ఈనెల 3న సతీష్ అన్న రమేష్ మద్యం బాగా తాగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి రాజ్యలక్ష్మి హుటా హుటిన గుంటూరులో అత్తగారింటికి వచ్చేసరికి అక్కడ గుడి ఆదిలక్ష్మి అనే యువతి ఉంది. ఆమె ఎవరు అని ప్రశ్నించడంతో సతీష్ భార్య అని, రెండో వివాహం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో రాజ్యలక్ష్మి పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 5న రాజ్యలక్ష్మి తిరిగి అత్తింటికి వెళ్లగా అత్త భిక్షావతి, మామ సాంబశివరావు, ఆడపడుచులైన చింతల శ్రీలత, చింతల శ్రీను ఆమెను బయటకు గెంటేశారు. దీంతో రాజ్యలక్ష్మి గత నాలుగు రోజులుగా అత్తింటి ముందే బైఠాయించి నిరసనకు దిగింది. నాలుగురోజులుగా అత్తింటి ముందు బైఠాయించిన రాజ్యలక్ష్మి విషయం తెలిసి పాతగుంటూరు సీఐ మొయిన్ సోమవారం అక్కడకు వెళ్లి రాజ్యలక్ష్మిని కలిసి మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సీఐ, ఎస్సైల సస్పెన్షన్
వరంగల్: హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో పట్టుబడి వివాదాస్పదమైన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ లాడ్జిలో ఇద్దరు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజ్యలక్ష్మి భర్త సునీల్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఉప్పందించారు. వెంటనే ఇద్దరినీ డీఐజీ తన కార్యాలయానికి అటాచ్ చేశారు. -
భర్తే కాలయముడు!
పోతిరెడ్డిపాలెంలో అంగన్వాడీ టీచర్ హత్య ? తండ్రే పీక నులిమి చంపాడంటున్న కొడుకు అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు మూడుముళ్లు వేసి నూరేళ్లూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు !అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను కడతేర్చాడు !! యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి (28) దారుణ హత్యకు గురైంది.తన తల్లిని తండ్రే పీక నులిమి హతమార్చినట్టు ఆరేళ్ల కొడుకు తరుణ్ చెబుతున్నాడు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి... పోతిరెడ్డిపాలెం ఇందిర మ్మ కాలనీలో రాజాన సూర్యనారాయణ, రాజ్యలక్ష్మి నివాసముంటున్నారు. మాకవరపాలెం మండలం జెడ్.గంగవరానికి చెందిన రాజ్యలక్ష్మికి సూర్యనారాయణతో 2006 మే 10న వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు తరుణ్, నాలుగేళ్ల కుమార్తె గ్రీష్మ ఉన్నారు. సూర్యనారాయణ స్థానికంగా చిన్న కాన్వెంట్ నడుపుతున్నాడు. భార్య రాజ్యలక్ష్మి పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు రామభద్రపురంలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. మద్యానికి బానిసైన సూర్యనారాయణ తరచూ భార్యను వేధించేవాడు. గతంలో పలుమార్లు గ్రామపెద్దలు, యలమంచిలి పోలీసు లు, అనకాపల్లి మహిళా పోలీసులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి బాగా మద్యం సే వించి వచ్చిన సూర్యనారాయణ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వివాదం పెద్దదైంది. అనంతరం రాజ్యలక్ష్మి నిద్రపోగా ఆమె పీక నులిమి చంపినట్లు సంఘటనా స్థలంలో ఆధారాలు తెలియజేస్తున్నాయి. కొడుకు తరుణ్ కూడా ఇదే చెబుతున్నాడు. ఇద్దరికీ ముఖం, మెడ భాగాల్లో గోళ్ల రక్కులు ఉండటం, గదుల్లో చేతిగాజులు ముక్కలు, ముక్కలుగా పడి ఉండటం కన్పించాయి. అనంతరం ఆమెను మూడో గదిలో స్లాబ్‌కున్న ఇనుప కొక్కానికి చీరతో వేలాడదీశాడు. శుక్రవారం రాత్రి తాను నిద్రిస్తున్న సమయంలో ఉరిపోసుకుని చనిపోయిందంటూ శనివారం ఉదయం సూర్యనారాయణ అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ, ఏఎస్ఐ హరి జోన్స్ సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కలవారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. తన కూతురిది హత్యే : కూతురు మృతి వార్త తెలుసుకున్న ఆమె తల్లి గంగతల్లి బంధువులతో కలిసి మాకవరపాలెం మండలం జెడ్.గంగవరం నుంచి పోతిరెడ్డిపాలెం చేరుకుంది. రాజ్యలక్ష్మి మృత దేహం వద్ద బోరున విలపించింది. నిత్యం చిత్రహింసలు పెడుతున్న సూర్యనారాయణే తమ కూతుర్ని హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు 498ఎ, 306 సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. అయితే ఆమె తాను హత్యచేయలేదని, ఉరిపోస్తుకుందని సూర్యనారాయణ చెబుతున్నాడు. -
ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సీపీ పాగా
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా కె.శకుంతల ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టెక్కలి ఆర్డీవో శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ముందుకు సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి పేరును చైర్‌పర్సన్‌గా చదివివినిపించారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. అనంతరం టీడీపీ అభ్యర్థి బుగత కుమారి పేరు ను ప్రస్తావించగా 11 ఓట్లు వచ్చాయి. (8 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్యెల్యే అశోక్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటేశారు). దీంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేశారు. వైస్‌చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శకుంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభినందనల వెల్లువ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికైన రాజ్యలక్ష్మి, శకుంతలను ఎన్నికల అధికారి శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్, సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్చార్జి రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంప్రసాద్, నరేంద్రలు పుష్పగుచ్చాలతో అభినందించారు. చైర్పర్సన్ రాజ్యలక్ష్మి వైఎస్సార్ సీపీ మునిసిపల్ కన్వీనర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పిలక పోలారావు కోడలు కాగా, వైస్‌చైర్‌పర్సన్ కాళ్ల శకుంతల పార్టీ నాయకుడు కాళ్ల దేవరాజ్ భార్య. రాజ్యలక్ష్మి (ఎమ్మెస్సీ) ఉన్నత విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరంగా మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ దివంగత ముఖ్యమంత్రి ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.