నిందితులు నలుగురూ యువతీయువకులే
{పేమ, ఆర్థిక వ్యవహారాలే కారణం
భీమడోలు : ఓ యువకుడిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను శుక్రవారం రాత్రి భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మండలంలోని ఆగడాలలంక గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల వినయ్‌సుధీర్ (28)ను జూలై 12న పోలసానిపల్లి పేరయ్యకోనేరు చెరువు వద్ద హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసు వివరాలను భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ విలేకరులకు తెలిపారు. ఆర్థిక పరమైన, ప్రేమ వ్యవహారాలే హత్యకు కారణమని ఆయన సృష్టం చేశారు.
రాజమండ్రిలోని కొంతమూరుకు చెందిన అన్నాచెల్లెళ్లు లింగంపల్లి రమేష్ (22), లింగంపల్లి సునీత (19)తో పాటు కొవ్వలి సురేంద్ర (22), కుమారి రాజ్యలక్ష్మి పథకం ప్రకారం యాళ్ల వినయ్‌సుధీర్‌ను కాళ్లు కట్టి కర్రలతో కొట్టి అతికిరాతకంగా చంపారన్నారు. వినయ్‌సుధీర్‌కు కొంతకాలం క్రితం ఓ రాంగ్ కాల్ చేయడంతో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన లింగంపల్లి సునీత పరిచయమైందన్నారు. వారిద్దరి ఫోన్ పరిచయం ప్రేమగా మారింది. ఈతరుణంలోనే రెండేళ్ల క్రితం లింగంపల్లి సునీత కుటుంబం రాజమండ్రి మకాం మారింది. సునీత, సుధీర్ మధ్య సంబంధం కొనసాగింది. వీరిద్దరూ తరుచుగా పోలసానిపల్లిలో కలిసేవారు. వినయ్ సుధీర్ సునీత వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇదిలావుండగా అదే గ్రామంలో ఉంటున్న సునీత ద్వారా రాజ్యలక్ష్మి అనే మహిళ సుధీర్‌కు పరిచయమైంది. రాజ్యలక్ష్మి నుంచి కూడా సుధీర్ కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. సునీత తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.
పెళ్లి విషయాన్ని సుధీర్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం గత నెల 12న సాయంత్రం సునీత సుధీర్‌కు ఫోన్‌చేసి పోలసానిపల్లి రమ్మంది. ఆమె స్కూటర్‌పై అక్కడికి వెళ్లగా, మిగిలిన ముగ్గురు కొంతమూరు నుంచి ఆటోలో వచ్చారు. బైక్‌పై వచ్చిన సుధీర్‌తో సునీత మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు కర్రలతో సుధీర్ మర్మాంగంపై కొట్టారు. కాళ్లు కట్టేశారు. అనంతరం హతమార్చి వెళ్లిపోయారు. నిందితుడు లింగంపల్లి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ సుధీర్‌ను భయపెట్టాలకున్నామే తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదన్నాడు. విలేకరుల సమావేశంలో సమావేశంలో ఎస్సైలు బి.వెంకటేశ్వరరావు (భీమడోలు), సీహెచ్ సతీష్‌కుమార్ (ద్వారకాతిరుమల), ఎం.సుభాష్ (దెందులూరు), హెచ్‌సీ అమీర్ పాల్గొన్నారు.
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
Published Sat, Aug 1 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement