చిత్తూరు జిల్లా సత్యవేడులో రాజ్యలక్ష్మి అనే చిట్టీల వ్యాపారి కోటిన్నర రూపాయలతో పరారైంది.
సత్యవేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా సత్యవేడులో రాజ్యలక్ష్మి అనే చిట్టీల వ్యాపారి కోటిన్నర రూపాయలతో పరారైంది. బాధితుల కథనమిదీ.. పదేళ్లుగా రాజ్యలక్ష్మి తానప్ప మొదలి వీధిలో నివసిస్తూ చిట్టీల వ్యాపారం చేస్తోంది. పంచాయతీ పరిధిలో అందరికీ నమ్మకం కలిగేలా చిట్టీ డబ్బులు అందజేస్తోంది. అయితే, వారం రోజులుగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంటోంది.
దీంతో చిట్టీలు కట్టిన సుమారు 200 మంది మహిళలు బుధవారం ఆరాతీయగా వారం రోజులుగా స్థానికంగా లేదని తేలింది. బెంగళూరు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో వారంతా సత్యవేడు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.