సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తెల్లం రాజ్యలక్ష్మిని నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ 27 మంది సమన్వయకర్తలతో విడుదల చేసిన జాబితాలో ఆమెకు స్ధానం దక్కింది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణిగా, ప్రభుత్వ టీచర్‌గా రాజ్యలక్ష్మి నియోజకవర్గమంతా సుపరిచితం. 2024 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తారని ప్రకటించారు.
బీఏ, బీఈడీ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి 24 ఏళ్లకే టీచర్‌గా విధుల్లోకి చేరారు. 23 ఏళ్ళుగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో నియోజకవర్గంలో ప్రధాన అంశాలపై సమగ్ర అవగాహనతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బాలరాజు గెలుపులోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకుని రాజ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే బాలరాజు ఇంటికి చేరుకుని ఎమ్మెల్యే దంపతులను అభినందించారు. ప్రస్తుతం రాజ్యలక్ష్మి బుట్టాయగూడెం మండలం దొరమామిడి ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
రాజ్యలక్ష్మి బయోడేటా
భర్త పేరు: తెల్లం బాలరాజు (ఎమ్మెల్యే పోలవరం)
వయస్సు: 47
విద్యార్హత: బీఏ–బీఈడీ
వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయిని
పనిచేస్తున్న స్కూల్: బుట్టాయగూడెం మండలం దొరమామిడి ఎంపీయూపీ స్కూల్
పిల్లలు: ఇద్దరు కుమారులు
గ్రామం: బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు
Comments
Please login to add a commentAdd a comment