- ఐసీడీఎస్ జిల్లా పీడీ రాజ్యలక్ష్మి
- తాండూరు రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సంబంధిత కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలోని ఐసీడీఏస్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.... జిల్లా వ్యాప్తంగా 2793 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయని,గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సంబంధిత కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామాల్లోని సపోటింగ్,మానిటరింగ్ కమిటీ సభ్యులు అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవే క్షించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచులకు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 1625 కేంద్రాలను తనిఖీ చేశామని...త్వరలో అన్ని ప్రాజెక్టుల్లోని కేంద్రాలను తనిఖీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గ ర్భిణులకు గుడ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బాలామృతం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.
కొందరు దంపతులు ఆడపిల్లలను విక్రయిస్తున్నారని...ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని సూచించారు. త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం అందజేస్తామన్నారు. సమావేశంలో తాండూరు సీడీపీఓ వెంకట్‌లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘అంగన్‌వాడీ’ల్లో అక్రమాలు జరిగితే చర్యలు
Published Wed, May 6 2015 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement