
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తొలి హ్యాంగింగ్ రెస్టారెంట్ మాదాపూర్‌లో షురూ అయింది. ఆకాశమార్గన ఆతిథ్యం ఆస్వాదించేలా రూపొందించిన క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు దత్ కొల్లి, తరుణ్ కొల్లి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి హ్యాంగింగ్ రెస్టారెంట్‌ను తాము ఏర్పాటు చేశామని, మరిన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీనిని విస్తరింపజేయనున్నామన్నారు. దాదాపు 160 అడుగుల ఎత్తులో కూర్చొని నచ్చి న వంటకాలను ఆస్వాదించడానికి తమ రెస్టారెంట్ అవకాశమిస్తుందన్నారు. అయితే ఒక సెషన్‌కి 26 మంది అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుందని, డిన్నర్ సమయంలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని, ఒక్కో సెషన్‌లో వీరు గంట పాటు గడపవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment