opened
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్యలో మరో ఉత్సవానికి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
నంద్యాలలో జీవీ మాల్ ప్రారంభించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
Siddu Jonnalagadda : గేమింగ్ జోన్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన డీజే టిల్లు (ఫొటోలు)
-
తెరుచుకున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్..!
-
ఫ్లైఓవర్‌పై రయ్ రయ్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ జంక్షన్లో ఫస్ట్‌లెవల్ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గురువారం దీనిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.30.26 కోట్ల వ్యయం తో 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు (వన్‌వే)తో నిర్మించిన ఈ ఫస్ట్‌లెవల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగనుంది. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, జీహెచ్ఎంసీ సీఈ జియావుద్దీన్, వెస్ట్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ప్రాజెక్ట్స్ ఈఈ వెంకటరమణ పాల్గొన్నారు. ట్రాఫిక్ చిక్కులు వీడినట్లే.. ► బయోడైవర్సిటీ జంక్షన్లో రెండు వంతెనలు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ చిక్కులు వీడినట్టే. మెహిదీపట్నం, ఫిలింనగర్, మణికొండ వైపు నుంచి వచ్చే వాహనదారులు లెవల్–2 ఫ్లైఓవర్ పై నుంచి ఐకియా మీదుగా మైండ్‌స్పేస్ అండర్‌పాస్ ద్వారా మాదాపూర్ ఐటీ కంపెనీలు, సైబర్‌టవర్ వైపు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తున్నారు. ► ఫస్ట్ లెవల్ వంతెన అందుబాటులోకి రావడంతో లింగంపల్లి, కొండాపూర్, ఓఆర్ఆర్ నుంచి వచ్చే వాహనాలు సిగ్నల్ సమస్య లేకుండా మెహిదీపట్నం, ఇనార్బిట్ మాల్‌వైపు వెళ్లవచ్చు. ► లింగంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ఖాజాగూడ క్రాస్‌రోడ్డు వరకు రావాలంటే దాదాపు 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫస్ట్‌లెవల్ ఫ్లైఓవర్‌పై నుంచి 8 – 10 నిమిషాల్లోనే వెళ్లవచ్చు. దీనివల్ల దాదాపు 10 నిమిషాల సమయం ఆదా కానుంది. ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఇనార్బిట్ మాల్‌కు వెళ్లాలన్నా 20 నిమిషాలు పట్టేది. ఫస్ట్‌లెవల్ వంతెన, నాలెడ్జ్సిటీ లింక్‌రోడ్డు కూడా అందుబాటులోకి రావడంతో ఇప్పు డు 10 నిమిషాల్లోనే చేరవచ్చు. తద్వారా ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే వాహనదారులకు 10 నిమిషాలు ఆదా కానుంది. -
యువ పారిశ్రామికవేత్తలకు అండ: కేటీఆర్
కాచిగూడ: యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సీఎం ఎస్టీ ఎంటర్‌పెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీమ్‌లో భాగంగా హిమాయత్‌నగర్‌లో మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన ‘చీసీయానో పిజ్జా’సెంటర్‌ను గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘నేనే స్వయంగా వచ్చి షాప్ ప్రారంభిస్తానని ఈ నెల తొలివారంలో గౌతమికి మాటిచ్చాను. అందులో భాగంగానే ఈరోజు షాప్ ఓపెనింగ్‌కు వచ్చాను’అని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన ఆడబిడ్డలకు హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహకం ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన బిడ్డ ఇక్కడ పిజ్జా షాప్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిమాయత్ నగర్లో పిజ్జా సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్ -
ఓరుగల్లులో సినిమా చేస్తా..
కాజీపేట అర్బన్: లవర్ బాయ్ ఇమేజ్‌తో గుర్తింపు పొందిన నేను త్వరలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా అందరిని ఆకట్టుకునే సినిమాతో ముందుకు వస్తానని సినీహీరో వరుణ్‌సందేశ్ తెలిపారు. హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఓరుగల్లు అంటే ఎంతో ఇష్టం చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమా చేయాలనుంది. గతంలో టూర్లో భాగంగా వరంగల్‌కు వచ్చాను. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ ఫోర్ట్లతో పాటు నిట్ వరంగల్ చాలా ఇష్టమైన ప్రాంతాలు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతున్నందున వర్షం, ఎంసీఏ వంటి చిత్రాలతో సినీ రంగానికి అనువుగా నిలుస్తున్న వరంగల్‌లో సినిమా చేస్తా. బిగ్‌బాస్–3 ఓపికను నేర్పించింది... ఎంతో కోపంగా, ఓపిక లేకుండా, ప్రతి అంశానికి రియాక్ట్ అయ్యే నన్ను బిగ్‌బాస్–3లో 105రోజుల ప్రయాణం ఓపిక నేర్పించింది. నేను వితిక భార్యభర్తలమైనా బిగ్‌బాస్–3లో కంటెస్ట్‌లుగా పోటాపోటీగా టాస్క్‌లు చేశాం. టాప్–5లో నేను సైతం ఉండడం బిగ్ బాస్ నాకు నేర్పిన, అందించిన ఓర్పు, ఓపికతోనే. నేను నా భర్యతో పాటు 15 మంది కంటెస్ట్‌లతో అనుభూతులు, అభిరుచులను, కోపాలు–తాపాలు, అనుభావాలను పంచుకుంటూ ఆత్మీయులుగా మారిపోయాం. బిగ్‌బాస్–3 జర్నీ నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. నిత్యం షూటింగ్లో బిజీగా ఉండే నేను నా భార్య వితిక ఒకే చోట వంద రోజులు మనోభావాలను పంచుకునే అవకాశాన్ని అందించిన బిగ్‌బాస్‌కు రుణపడి ఉంటా. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే నన్ను టాప్–5లో బిగ్‌బాస్‌లో నిలబెట్టారు. నా అభిమానుల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. త్వరలో మల్టీస్టారర్... బిగ్‌బాస్–3 జర్నీ తర్వాత అనేక అవకాశాలు వస్తున్నాయి. పదికి పైగా స్టోరీలను విన్నాను. త్వరలో మల్టీస్టారర్ మూవీ, ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో ముందుకు వస్తా. ‘సే నో టూ ప్లాస్టిక్’లో వరంగల్ ముందుండాలి యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేదంతో పర్యావరణ పరిరక్షణలో ముందుండగా ప్రస్తుతం వరంగల్ సే నో టూ ప్లాస్టిక్ అంటూ ప్లాస్టిక్ రహితంగా వరంగల్ ఫస్ట్‌గా నిలవాలి. ప్లాస్టిక్ వినియోగంతో అనేక రోగాలు వస్తున్నాయి, వాతావరణం కలుషితమౌతుంది. పర్యావరణానికి ముప్పుగా మారిని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామంటూ వరంగల్‌వాసులకు వరుణ్‌సందేశ్ తన సందేశ్(శా)న్ని అందించారు. -
ఇసుకోత్సవం!
కష్టకాలం దాటింది. ఇసుక కొరత తీరింది. రీచ్‌లలో తవ్వకాలు మొదలయ్యాయి. లబి్ధదారుల చెంతకు ఇసుక లారీలు కదిలాయి. ఆగిన భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. కారి్మకుల కళ్లలో ఆనందాలు నిండాయి. కృష్ణమ్మ తగ్గుముఖం పట్టగా.. అధికార యంత్రాంగం ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఇసుక వారోత్సవాలు’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ఇసుకను అందించేందుకు సమాయత్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇసుక కొరతను అధిగమించారు. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉండగా మంగళవారం ఒక్కరోజే 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. జిల్లాలో కొత్తగా 9 రీచ్‌లను గుర్తించారు. మరో 125 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. మంగళవారం రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు జరిపారు. రాజధాని ప్రాంతంలోని స్టాక్ పాయింట్లు, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి కూడా వినియోగదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరులో నాలుగు రీచ్‌ల అనుమతులు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. సాక్షి, అమరావతి: జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పుష్కలమైన ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని లబి్ధదారులకు అందిచే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా రోజుకు 20వేల టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా మంగళవారం 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా కొత్త రీచ్‌లను గుర్తించడం, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పరిశీలన అనుమతులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరుల నాలుగు ఇసుకరీచ్‌ల అనుమతులు కోసం మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముమ్మర కసరత్తు.. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికే గాజులంక, బొమ్మువానిపాలెం, మున్నంగి, తాడేపల్లి, బత్తినపాడు (కృష్ణాజిల్లా), దిడుగు, కొంగంటివారిపాలెం, నవ్వులూరు, పెదకాకాని, చౌడవరంలో స్టాకు యార్డులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా కొత్తగా మరో నాలుగు స్టాకు యార్డులు బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఇసుక లభ్యతను మరింత పెంచేందుకు వీలుగా 125 పట్టాభూముల్లోనూ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా చేపట్టే చర్యలు.. కొత్త స్టాకుయార్డులు, ఇసుక డిపోల ఏర్పాటు ప్రధానంగా వేబ్రిడ్జిలు, లైంటింగ్, సీసీ కెమెరాలు, మౌలిక వసతుల కల్పన ప్రతి నియోజకవర్గంలో స్టాకుయార్డు, డిపోల వద్ద ఇసుక ధరలు తెలిపే విధంగా ప్రచారం రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ.375గా ప్రభుత్వం ధరను నిర్ణయించింది. అయితే తాజాగా స్టాక్ యార్డుల వద్ద నుంచి ఇసుక రీచ్‌లు ఎంత దూరంలో ఉన్నాయో చూసి ధరను నిర్ణయించి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పారదర్శకంగా సరఫరా.. ఇసుక వినియోగదారులకు పారదర్శకంగా అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలను తీసుకొంటోంది. కృష్ణా నదికి వరద తగ్గుముఖం పట్టడంతో, రీచ్‌లలో వీలైనంత ఎక్కువగా తవ్వకాలు జరిపేందుకు కల్టెకర్ ఐ.శామ్యూల్‌ఆనంద్‌కుమార్ నేతృత్వంలో కసరత్తు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఇసుక రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో స్టాకు ఉన్న, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి ఇసుకను వినియోగదారులకు కేటాయిస్తున్నారు. ఇసుక అందుబాటులో ఉంది.. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాం. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరం కాగా, మంగళవారం 20,204 టన్నుల ఇసుకను సరఫరా చేశాం. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. అవసరం లేకున్నా ఇసుకను కొనుగోలు చేసి వ్యాపారం చేసే దళారీలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇసుక రీచ్‌లు, స్టాకు పాయింట్ల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదు. అక్కడ ప్రత్యేక నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. –ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, కలెక్టర్ చాలా సంతోషంగా ఉంది నేను చిన్న ఇంటిని నిర్మించుకుంటున్నాను. కొద్ది రోజుల కింద ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. అధికారులు బుధవారం మంగళగిరి పట్టణంలోని అమరావతి టౌన్íÙప్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నాకు తొమ్మిది టన్నుల ఇసుకను సరఫరా చేశారు. –వల్లంశెట్టి బాలచంద్ర. కంతేరు, తాడికొండ మండలం -
అంబరాన ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తొలి హ్యాంగింగ్ రెస్టారెంట్ మాదాపూర్‌లో షురూ అయింది. ఆకాశమార్గన ఆతిథ్యం ఆస్వాదించేలా రూపొందించిన క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు దత్ కొల్లి, తరుణ్ కొల్లి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి హ్యాంగింగ్ రెస్టారెంట్‌ను తాము ఏర్పాటు చేశామని, మరిన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీనిని విస్తరింపజేయనున్నామన్నారు. దాదాపు 160 అడుగుల ఎత్తులో కూర్చొని నచ్చి న వంటకాలను ఆస్వాదించడానికి తమ రెస్టారెంట్ అవకాశమిస్తుందన్నారు. అయితే ఒక సెషన్‌కి 26 మంది అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుందని, డిన్నర్ సమయంలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని, ఒక్కో సెషన్లో వీరు గంట పాటు గడపవచ్చని తెలిపారు. -
దెందులూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం
-
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
తిరుమలలో టైం స్లాట్ సర్వదర్శనానికి శ్రీకారం
తిరుమల: శ్రీవారి టైంస్లాట్ సర్వదర్శనానికి సోమవారం నుంచి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో ఉదయం 6 గంటలకు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కౌంటర్లకు పూజ చేసి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన శకుంతలరామన్ ఆధార్‌కార్డు ఆధారంగా తొలి టికెట్టు పొందారు. 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న టైంస్లాట్లలో ఎంపిక చేసుకున్న సమయాన్నిబట్టి భక్తులు టికెట్లను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. టికెట్లు పొందిన భక్తులను దివ్యవదర్శనం కాంప్లెక్స్ నుండి అనుమతిస్తారు. టికెట్లను స్కానింగ్ చేసిన తర్వాత ఒక్కో భక్తుడికి రూ.10ల లడ్డూలు రెండు, రూ.25ల లడ్డూలు మరో రెండు అందజేస్తారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లిన భక్తులకు రెండు గంటల్లోపే శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశౠమని, మార్చి నుంచి తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేఈవో వెల్లడించారు. ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి లోటుపాట్లు సవరిస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో ఎ.రవికృష్ణ, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఐటీ అధికారి శేషారెడ్డి, పీఆర్వో రవి, డాలర్ శేషాద్రి పాల్గొన్నరు. కాగా, సర్వ దర్శనం స్లాట్ విధానం ద్వారా సోమవారం 18 వేలకుగాను 12 వేల టోకెన్లు జారీ చేశారు. మంగళవారం 20 వేలు మంజూరు చేయనున్నారు. -
‘నిషా’ మహమ్మారిపై నిప్పులు
- సోమవారం అదే హోరు - అమలాపురం పట్టణంలో తెరుచుకోని మద్యం దుకాణాలు - ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ నిరసనలు - జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు అమలాపురం టౌన్: ద్రవరూపంలోని ‘ఉపద్రవం’పై జనంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. తాగేవాడి కాలేయాన్నీ, వాడి కుటుంబ శ్రేయాన్నీ బలిగొనే మద్యం మాకొద్దంటూ వేలగొంతులు ఘోషిస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల నడుమ, గుడులకు, బడులకు చేరువలో బ్రాందీషాపుల ఏర్పాటుపై ప్రజలు భగ్గుమంటూనే ఉన్నారు. సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మద్యం షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తే, కొన్ని చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామస్తులు, కాకినాడ రూరల్ మండలం వేళంగిలో సిరిపురం కొప్పిశెట్టివారి పేట, జి.భావారం గ్రామస్తులు మహిళలతో నిరసనలకు దిగగా... కాకినాడ-రామచంద్రపురం, రాజోలు ప్రాంతాల్లో మహిళలు రాస్తారోకోచేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేయగా, కాకినాడలో ఎక్సైజ్ డీసీకి వినతిపత్రంఅందజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎక్సైజ్ డీసీకి, కాకినాడలో గాంధీనగర్ ప్రాంతీయులు జాయింట్ కలెక్టర్‌కు పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు గ్రామస్తులు పి.గన్నవరంలోని ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు. కోనసీమలో తెరుచుకోని దుకాణాలు... కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో మద్యం కొత్త పాలసీలో బార్లు, దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి ఎదరవుతున్న అభ్యంతరాలు, వ్యతిరేకతలతో ఎక్కడా మద్యం టింగమంటూ బోణి కాలేదు. పట్టణంలో మూడు బార్లు, ఎనిమిది దుకాణాలకు వ్యాపారులు లెసెన్సులు పొంది ఉన్నారు. ఒక్కో బార్‌కు రూ.22 లక్షలు..ఒక్కో దుకాణానికి రూ.11 లక్షలు వంతున ప్రభుత్వానికి చెల్లించేసి ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బార్లు, దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేసుకోవాల్సి ఉంది. నెల మొదలై అప్పుడు మూడు రోజులు గడుస్తున్నా పట్టణంలో ఇప్పటిదాకా బార్లు, దుకాణాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, దుకాణాలే నిర్ధారణ కాలేదు. ఇప్పటికే పది మంది వ్యాపారులు ప్రభుత్వానికి రూ.1.30 కోట్ల మేరు సొమ్ములు చెల్లించేసినా వ్యాపారాలు మొదలు కాకపోవటం ఒక సమస్యయితే ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ ప్రజల నుంచి అభ్యంతరాలు ఎదురు కావటం వారికి తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే పట్టణంలో సావరం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఏర్పాటు చేయబోయే దుకాణంపై అక్కడ ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ సమీపంలో 216 జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో పెడుతున్న దుకాణానికి అభ్యంతరాలు అనివార్యమయ్యాయి. మద్యం పాలసీపరంగా పట్టణ పరిధిలోకి వచ్చే పేరూరు గ్రామంలో కూడా దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన మహిళలు అమలాపురంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం తరలివచ్చి ధర్నా చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తే సహించేది లేదని అధికారులను మహిళలు హెచ్చరించారు. మద్యం దుకాణాలంటే ఎక్కడో ఓ చోట చిన్న జాగాలో కనీసం షెడ్డులోనైనా ఏర్పాటుచేసుకునే వీలుంటుంది. అదే బార్లకు భవనం ఉండాలి. పట్టణానికి దూరంగా ఆ స్థాయిలో భవనాలు దొరక్క... ఉన్నా బార్లకు అంటే అద్దెకు ఇవ్వక..ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కొనలేక బార్ల లైసెన్సుదారులు ఆందోళనలో పడ్డారు. కామనగరువులో దుకాణం తెరుచుకున్నా సమీపంలోనే ఓ విద్యా సంస్థ ఉండటంతో ఆ దుకాణాన్ని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
హైదరాబాద్‌లో సైక్లోకేఫ్ సెకండ్ ఔట్లెట్
-
పోలీస్ కన్వెన్షన్ హాలు ప్రారంభం
కాకినాడ రూరల్ : పోలీసులు తమ పరిధిలోని కమ్యూనిటీ , కన్వెన్షన్ హాళ్ల వంటి వాటిని ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకోవాలని డీజీపీ జేవీ రాముడు సూచించారు. కాకినాడలోని పోలీసు రిజర్వులైనులో రూ.1.35 కోట్లతో నిర్మించిన కన్వెన్షన్ హాలును బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కన్వెన్షల్ హాలును కేవలం పోలీసు సిబ్బందికే కాక బయట వారు కూడా ఫంక్షన్లు, పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలను చేసుకునేందుకు ఇస్తే ఆదాయం సమకూరుతుందన్నారు. ఆ రాబడిని పోలీసు కుటుంబాల సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు సంఘటనల్లో శాంతిభద్రతలు భంగపడకుండా పోలీసులు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రం విడిపోయాక పోలీసు సిబ్బంది సరిపడినంతగా రాష్ట్రానికి రాలేదన్నారు. ప్రస్తుతం నియామకానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాష్, ఏఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో వోక్సేన్ బిజినెస్ స్కూల్ ప్రారంభం