అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.
అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment