సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ అమ్మాయిల డెడ్‌బాడీలు | Teenage Girls Found Dead Hanging Tree At Indian Border | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ ముగ్గురు అమ్మాయిల డెడ్‌బాడీలు

Published Mon, Jul 25 2022 11:00 AM | Last Updated on Mon, Jul 25 2022 11:50 AM

Teenage Girls Found Dead Hanging Tree At Indian Border - Sakshi

దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ ఘటన ఇండియా-నేపాల్‌ సరిహద్దుల్లో బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లా ఠాకూర్గంజ్‌ వద్ద ఓ రేగు చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ ముగ్గురు మైనర్లు కనిపించారు.

ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు మైనర్లు కరీనా గణేష్‌(16), కల్పనా గణేశ్‌(16), అంజలి గణేశ్‌(17).. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత పాఠక్ తెలిపారు. ఈ మేరకు వారి పేరెంట్స్‌ మిస్సింగ్‌ కేసుగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వీరు ముగ్గురు సుంకోషి టీ గార్డెన్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement