తాడుతో ఉరివేసుకుని వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు(జీ) శివారు తాట్యతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఉరి వేసుకుని వివాహిత మృతి
Aug 30 2016 11:40 PM | Updated on Oct 1 2018 6:22 PM
కొత్తూరు (కురవి) : తాడుతో ఉరివేసుకుని వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు(జీ) శివారు తాట్యతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం.. తాట్య తండాకు చెందిన బోడ భూల్య భార్య ఈరి(50) తన పెద్ద కుమారుడు వీరన్న కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని కిందకు దించగా మెడలో తాడుతో ఉరివేసుకుని ఉన్న గుర్తు ఉంది. విషయం కురవి పోలీసులకు సమాచారం అందచేశారు. వెంటనే ఎస్సై అశోక్ తన సిబ్బందితో తండాకు చేరుకున్నారు. చని పోయిన ఈరి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి మరో కుమారుడు భద్రు ఉన్నాడు. భద్రు మాత్రం తన అన్నయ్య, తండ్రి కలిసి అమ్మను చంపారని ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మొత్తానికి అనుమానాస్పదస్థితిగా తండావాసులు చెబుతున్నారు.
Advertisement
Advertisement