న్యూఢిల్లీ: మెడకు ఉరి బిగించడం ద్వారా మరణ దండన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందనను తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ రిషీ మల్హోత్రా వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందనీ, ఇది ఖైదీలకు సైతం వర్తిస్తుంద’ని కోర్టుకు విన్నవించారు.
ఖైదీలు గౌరవప్రదంగా, తక్కువ బాధతో చనిపోయేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉరి బిగించడం ద్వారా కాకుండా విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చటం, కరెంట్ చైర్, గ్యాస్ ఛాంబర్‌లో బంధించడం వంటి ఇతర మార్గాలను పరిశీలించవచ్చని వెల్లడించారు. పిటిషనర్ వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment