రూ.83 లక్షల ప్యాకేజీ.. బీటెక్‌ పాపకు గోల్డెన్‌ ఆఫర్‌ | BTech Student Bags Package Of Rs 83 Lakh Per Annum Job Offer | Sakshi
Sakshi News home page

రూ.83 లక్షల ప్యాకేజీ.. పరీక్షలు పూర్తికాకముందే బీటెక్‌ పాపకు గోల్డెన్‌ ఆఫర్‌

Published Mon, Feb 26 2024 7:08 PM | Last Updated on Mon, Feb 26 2024 7:34 PM

BTech Student Bags Package Of Rs 83 Lakh Per Annum Job Offer - Sakshi

జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని, దానివైపే అడుగులు వేస్తే తప్పకుండా అనుకున్న గమ్యం చేరుతారని ఎంతోమంది నిరూపించారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన 'ఇషికా ఝా'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

భాగల్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో బీటెక్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థిని 'ఇషికా ఝా' క్యాంపస్ ప్లేస్‌మెంట్ నుంచి ఏకంగా 83 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ పొందింది.

చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు, కోడింగ్ పట్ల మక్కువతోనే.. కోడింగ్ రాయడం ప్రారంభించింది. ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మెలుకువలు నేర్చుకుంటూ అనుకున్న విధంగానే జాబ్ కొట్టేసింది. 2020-24 సెషన్‌లోని బీటెక్ బ్యాచ్ చివరి సంవత్సరం కంటే.. కూడా ఈమె ఎక్కువ ప్యాకేజ్ పొంది రికార్డ్ బద్దలుకొట్టింది.

గూగుల్ హ్యాకథాన్ చివరి రౌండ్‌లో.. ప్రాజెక్ట్ చేయడానికి 'ఎన్విరాన్‌మెంట్' టాపిక్‌ వచ్చిందని, ఆ సమయంలో ఇషికా ఝా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి ఫారెస్ట్ ఫైర్ ప్రిడిక్షన్‌పై చేసిన ప్రాజెక్ట్ విజయ శిఖరాలను తాకేలా చేసింది.

బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్‌కి ప్రిపేర్ కావడం ప్రారంభించినట్లు ఇషికా ఝా వెల్లడించింది. గూగుల్ హ్యాకథాన్‌లో విజయం సాధించినందుకు తన సీనియర్‌లకు క్రెడిట్ ఇస్తూ, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా కూడా తాను ఎక్కువ నేర్చుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు

ప్రస్తుతం ఈమె టెక్నికల్ డొమైన్ నేయిపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో, వెబ్ డెవలప్‌మెంట్ వంటి వాటిని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాలనే తన అభిరుచి తనను ఇతరులకు భిన్నంగా చేస్తుందని ఝా చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement