Married Women, Engineering Student Escape From House In Karnataka - Sakshi

పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థితో జంప్‌

Aug 29 2022 7:04 AM | Updated on Aug 29 2022 11:37 AM

Married Woman, Engineering Student escape frpm house in karnataka - Sakshi

పోలీసుల అదుపులో అయిషా, బీర్‌ మోహద్దీన్‌లు

బెంగళూరు: వివాహమై ఇద్దరు పిల్లలున్న తల్లి... ఇంజనీరింగ్‌ చదివిన యువకుడు. ఇద్దరికి బాల్యం నుంచి పరిచయం, ఈ నేపథ్యంలో ఇద్దరు పారిపోయి కారవార్‌ వచ్చారు. భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కథ అంతా బయట పడింది. దీంతో పోలీసులు యువకుడితో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు... బీర్‌ మోహిద్దీన్‌ చెన్నైకి చెందినవాడు. ఇటీవల ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. దూరపు బంధువైన అబ్దుల్‌ ఖాదర్‌ యువకుడికి పెళ్లి సంబంధాలను చూడటాన్ని ప్రారంభించారు. దీంతో బీర్‌ మోహద్దీన్‌ అప్పుడప్పుడు ఖాదర్‌ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయన కోడలు అయిషాతో బాల్యం నుండి పరిచయం. దీంతో అయిషాను తీసుకుని బీర్‌ మోహద్దీన్‌లు కారవారకు పారిపోయాడు.

ఎవరికి తెలియకుండా ఆరు నెలల నుండి అక్కడే కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో తమిళనాడు పోలీసులు అదృశ్యమైన అయిషాను కోసం వెతుకుతూ కారవారకు రావటంతో స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుండి ఇద్దరు అద్దె ఇంటిలో కారవారలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

చదవండి: (గుజరాత్‌పై కుట్రలు)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement