
టాలెంట్‌స్ప్రింట్ సంస్థ విమెన్ ఇంజినీర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఇంజినీరింగ్ విద్యార్థినులు
రాయదుర్గం: ‘ఇంజినీరింగ్ చేసిన అమ్మాయిల్లో గ్లోబల్ టెక్ కెరీర్‌పై ఆకాంక్ష’ అనే అంశంపై ఓ నివేదికను గచ్చిబౌలిలోని టాలెంట్ స్ప్రింట్ బుధవారం విడుదల చేసింది. టాలెంట్ స్ప్రింట్ కంపెనీ చేపట్టిన విమెన్ ఇంజినీర్ (డబ్ల్యూఈ) ప్రోగ్రామ్‌కు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 83 విశ్వవిద్యాలయాలకు చెందిన 7,276 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి తీసుకున్న గణాంకాలు, విశ్లేషణల ఆధారంగా సమాచారాన్ని క్రోడీకరించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడపోయడానికి డబ్ల్యూఈ ప్రోగ్రామ్‌లోకి 100 మందిని ఆహ్వానించడానికి బహుళ దశల్లో విస్తృతంగా చేపట్టిన ఎంపిక ప్రక్రియ ఉపయోగపడింది. దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సమానమైన స్పందన రావడం విశేషం. అమ్మాయిల్లో గ్లోబల్ టెక్ కెరీర్‌పై ఉన్న ఆకాంక్షకు వారి తల్లిదండ్రుల విద్యా నేపథ్యానికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దరఖాస్తుదారుల్లో అధిక శాతం మంది స్వల్ప ఆదాయ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినవారు ఉండటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి.
నివేదిక వివరాలివీ..
♦ దరఖాస్తుదారుల్లో 50 శాతం మంది నగరాలు, 28 శాతం పట్టణాలు, 22 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు
♦ 33 శాతం మంది తమ కుటుంబాల నుంచి పట్టభద్రులు మొదటి తరంగా నిలిచారు
♦ దరఖాస్తుదారుల్లో 83 శాతం మంది సంవత్సర ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు
♦ 47 శాతం మంది సొంతంగా> నేర్చుకుంటున్నా వారికి ప్రపంచ సాంకేతిక పోకడలపై అవగాహన లేదు
♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 50 శాతం మంది క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్ పాసైనవారు
♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 34 శాతం మంది రైటింగ్ స్కిల్స్ అసెస్‌మెంట్‌లో పాసైనవారు
♦ టెస్ట్ రాసిన దరఖాస్తుదారుల్లో 40 శాతం మంది చాలెంజింగ్ కోడ్ రీడింగ్ అసెస్‌మెంట్ పాసైనవారు
♦ 31 శాతం మంది అడ్వాన్స్‌డ్ క్వాలిటీవ్ స్కిల్స్ అసెస్‌మెంట్ పాసైనవారు
♦ 20 శాతం మంది అన్ని అసెస్‌మెంట్లలో పాసైనవారు
♦ టెస్ట్ రాసిన ప్రతి అయిదుగురిలో ఒకరు అగ్రశ్రేణి గ్లోబల్ కెరీర్‌ను చేరుకోగలిగే శక్తిసామర్థ్యాలను కలిగి ఉన్నవారు ఈ సందర్భంగా టాలెంట్ స్ప్రింట్ సంస్థ సీఈఓ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శంతన్‌పాల్ మాట్లాడుతూ.. టాలెంట్ స్ప్రింట్ అందిస్తున్న డబ్ల్యూఈ ప్రోగ్రామ్ ద్వారా రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హైటెక్ కెరీర్ 600 మంది పట్టభద్రులైన ఇంజినీరింగ్ అమ్మాయిలను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment