
శిరీష (ఫైల్)
సాక్షి, జగద్గిరిగుట్ట: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ «ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శిరీష (22) గుంటూరులో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఆల్వీన్ కాలనీలోని తన బంధువుల (పెద్దమ్మ కూతురు) ఇంట్లో ఉంటోంది. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో శిరీష బంధువులు ఉంటుండగా మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇచ్చారు. పెంట్‌హౌజ్ ఖాళీగా ఉంది.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌తో నేరుగా భవనం టాప్ ఫ్లోర్‌కు వెళ్లింది. అక్కడ బాటిల్‌లోని పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిమి భరించలేక అరవడంతో యువతి బంధువులు, స్థానికులు టెర్రస్‌పైకి వెళ్లి మంటలు ఆరి్పవేశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..
శిరీష మృతికి కారణాలు తెలియరాలేదు. తల్లిదండ్రుల ఆర్థికక పరిస్థితి బాగానే ఉందని, కుటుంబ సభ్యులు, బంధువులతో ఎంతో ఆప్యాయంగా ఉంటుందని తెలిసింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment