ముంబై: ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఇతడు హాస్టల్ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి వయసు 18 ఏళ్లు. కాలేజీలో జాయిన్ అయి మూడు నెలలే అయింది. ఫస్ట్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా శనివారమే ముగిశాయి. ఆ మరునాడే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఈ విద్యార్థి ఎప్పుడూ ఒంటిరిగా ఉంటాడని, హాస్టల్ రూమ్‌మేట్‌తో కూడా సరిగా మాట్లాడట్లేదని పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పరీక్షల ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు..
Comments
Please login to add a commentAdd a comment