Jump From building
-
Khammam: శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, ఖమ్మం: హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే ఖమ్మం శ్రీచైతన్య స్కూల్లో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాయి శరణ్య అనే పదో తరగతి స్టూడెంట్.. పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడినట్లు చెబుతున్నారు. చదవండి: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి -
IIT Bombay: ఏడో అంతస్తు నుంచి దూకిన ఐఐటీ విద్యార్థి..
ముంబై: ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఇతడు హాస్టల్ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి వయసు 18 ఏళ్లు. కాలేజీలో జాయిన్ అయి మూడు నెలలే అయింది. ఫస్ట్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా శనివారమే ముగిశాయి. ఆ మరునాడే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విద్యార్థి ఎప్పుడూ ఒంటిరిగా ఉంటాడని, హాస్టల్ రూమ్మేట్తో కూడా సరిగా మాట్లాడట్లేదని పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పరీక్షల ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. -
కరీంనగర్లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
గంగాధర(చొప్పదండి): చదువంటే ఇష్టం లేక, హాస్టల్లో ఉండలేక ఓ పదో తరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో ఆంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యతి్నంచింది. అయితే ప్రాణాపాయం తప్పిపోగా, కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గంగాధర ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన స్వప్న– లక్ష్మీనారాయణ కూతురు హాసిని గంగాధర మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. అయితే చదువంటే ఇష్టం లేదని, హాస్టల్లో ఉండనని మొండికేసి కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తెను బ్రతిమిలాడి ఒప్పించి ఐదురోజుల క్రితం హాస్టల్లో చేర్పించి వెళ్లారు. ఆదివారం సాయంత్రం హాసిని వసతిగృహం మూడో అంతస్తుపైకి వెళ్లింది. అక్కడికి ఎవరూ రాకుండా తలుపులు బిగించి వెళ్లి రెయిలింగ్‌పై కూర్చొంది. ఉపాధ్యాయు లు, విద్యార్థులు గమనించి వారించినా వినకుండా పైనుంచి దూకేసింది. అయితే ఎడమకాలు విరిగి, ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన హాసినిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
నోయిడా: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి అపార్ట్మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్ సొసైటీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హరియాణా సోనిపత్‌కు చందిన ఈ టేకీ వయసు 26 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఊద్యోగం చేస్తున్నాడు. చండీగఢ్‌కు చెందిన యువతిని(25) కలిసేందుకు నోయిడా వెళ్లాడు. ఆన్లైన్ యాప్ ద్వారా ఈ రూం బుక్ చేసుకున్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు యువతి కిందకు వెళ్లింది. ఈ సమయంలోనే 20వ అంతస్తు నుంచి టేకీ కిందకు దూకేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కెఫే టేబుల్స్‌పై పడ్డాడు. దీంతో ఆ టేబుల్స్ విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి. అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఇద్దరూ గురువారం రోజే ఆపార్ట్మెంట్కి వచ్చారని పోలీసులు చెప్పారు. కలిసి మద్యం కూడా తాగారని పేర్కొన్నారు. ఆయితే శుక్రవారం రోజు గర్ల్‌ఫ్రెండ్ తన స్నేహితురాలిని కూడా అపార్ట్‌మెంట్‌కు పిలిచింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది. దీంతో మరో యువతిని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచావని సాఫ్ట్వేర్ ఉద్యోగి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. ఈ విషయంపైనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడికి బాల్య స్నేహితురాలని పేర్కొన్నారు. అతను త్వరలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, అందుకే ఓసారి స్నేహితురాలిని కలవాలనుకున్నాడని వివరించారు. చదవండి: భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ -
Hyderabad: ఇల్లు శుభ్రం చేస్తుండగా బాల్కీనీలో నుంచి కింద పడిన మహిళ
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంపల్లి బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న రీనితా రెడ్డి(33) బుధవారం అదే ఆపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య కారణాల రీత్యా గత కొన్ని రోజులుగా మానసికంగా కృంగిపోయిన రీనిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్ గచ్చిబౌలి: భవనంపై నుంచి పడి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన మేరకు.. నీలంపేట గ్రామం, చీడికాడ మండలం, వైజాగ్‌కు చెందిన బోను సత్యవతి(42) నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివాసం ఉంటోంది. సాయి సిగ్నేచర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 305లో పది రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద సత్యవతి హౌస్‌మేడ్‌గా పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లాట్ నెంబర్ 305లో శుభ్రం చేస్తుండగా బాల్కానీలోని వాష్ ఏరియా నుంచి కింద పడింది. దీంతో ఆమె తల, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే కాంటినెంటల్ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే సత్యవతి మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు దృవీకరించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాద వశాత్తు జారి పడిందా అనే విషయం విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. భర్త బోను ఈశ్వర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్‌వెస్ట్ వాషింగ్టన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రోపాలిటిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్ పామర్గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘోస్ట్ గన్ చట్టం తెచ్చినా.. అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్ గన్లు అంటారు. అంటే లైసెన్స్ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు! -
అందరూ వదిలేయడంతో అనాథలా.. నటి ఆత్మహత్య
మంచి ఉద్యోగం-జీతం.. రెండింటినీ వదులుకుందామె. ఎవరూ ఊహించని రీతిలో పోర్న్ సినిమాల వైపు అడుగులేసింది. ఆ నిర్ణయంతో అయినవాళ్లకు దూరమైంది. చివరకు అనాథలా ఆత్మహత్యకు పాల్పడింది నటి క్రిస్టియానా లిసీనా. క్రిస్టియానా ‘క్రిస్ ది ఫాక్స్’ పేరుతో పాపులర్ అయిన రష్యన్ అడల్ట్ నటి. వయసు 29 ఏళ్లు. పోర్న్‌హబ్, ఓన్లీఫ్యాన్స్ సైట్ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆదివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ 22 అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చేతిలో కాయిన్ నేవ్స్కై పోలీసులు లిసీనా చేతిలో ఓ కాయిన్‌ను గుర్తించారు. దాని మీద ‘నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావ్’ అనే కొటేషన్ ఉంది. అది తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ఆమె రాసి ఉంటుందని భావిస్తున్నారు. చనిపోయే కాసేపటి ముందే ఆమె బిల్డింగ్‌లోకి ఎంటర్ అయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. గత కొంతకాలంగా లిసీనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఆమె మరణవార్త తెలియగానే ప్రియుడు రుస్తామ్.. సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఒంటరితనం భరించలేకే ఆమె చనిపోయిందని వాపోయాడు. క్రిస్టియానా అంత్యక్రియల కోసం సాయం చేయాలని కోరడంతో.. కొందరు ముందుకొచ్చారు కూడా. బ్యాంక్ జాబ్ వదిలి.. సైబీరియాకు చెందిన క్రిస్టియానా లిసీనా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆపై క్రాస్కోయార్స్క్లో బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఐదురోజులు మాత్రమే పని చేసిన ఆమె.. ఆసక్తి లేక అడల్ట్ సినిమాల వైపు మళ్లింది. దీంతో కుటుంబం ఆమెను వెలేయడంతో సెయింట్ పీటర్బర్గ్స్కు మకాం మార్చింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ.. కుదరలేదు. ఆమధ్య ఒంటరితనం తన పాలిట శాపమైందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయాన్ని.. ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక ఆమె చనిపోయాక ఓన్లీఫ్యాన్స్ పేజీలో ఆమె పేరుతో ఉన్న అకౌంట్‌ను తొలగించారు. మిగతా సైట్లలోనూ ఆమె వీడియోలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
లైంగిక వేధింపులు.. భవనంపై నుంచి దూకిన బాలిక