Software Engineer Jumps To Death From 20th Floor In Noida - Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌..

Published Sun, Feb 5 2023 3:23 PM | Last Updated on Sun, Feb 5 2023 5:32 PM

Software Engineer Jumps To Death From 20th Floor In Noida - Sakshi

నోయిడా: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి అపార్ట్‌మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్‌ సొసైటీలో శుక్రవారం రాత్రి  ఈ ఘటన జరిగింది. హరియాణా సోనిపత్‌కు చందిన ఈ టేకీ వయసు 26 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఊద్యోగం చేస్తున్నాడు.  చండీగఢ్‌కు చెందిన యువతిని(25) కలిసేందుకు నోయిడా వెళ్లాడు. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఈ రూం బుక్ చేసుకున్నారు. 

అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు యువతి కిందకు వెళ్లింది. ఈ సమయంలోనే 20వ అంతస్తు నుంచి టేకీ కిందకు దూకేశాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కెఫే టేబుల్స్‌పై పడ్డాడు.  దీంతో ఆ టేబుల్స్ విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి.  అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఇద్దరూ గురువారం రోజే ఆపార్ట్‌మెంట్‌కి వచ్చారని పోలీసులు చెప్పారు. కలిసి మద్యం కూడా తాగారని పేర్కొన్నారు. ఆయితే శుక్రవారం రోజు గర్ల్‌ఫ్రెండ్ తన స్నేహితురాలిని కూడా అపార్ట్‌మెంట్‌కు పిలిచింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది.

దీంతో మరో యువతిని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచావని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. ఈ విషయంపైనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడికి బాల్య స్నేహితురాలని పేర్కొన్నారు. అతను త్వరలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, అందుకే ఓసారి స్నేహితురాలిని కలవాలనుకున్నాడని వివరించారు.
చదవండి: భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement