నోయిడా: రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయినా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి. సొంతింటిలో జీవించడం ప్రతి ఒక్కరి కల కావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయ పడుతుంటారు.
ఇక లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్ కొనడమంటే కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ఇంటి ధర తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా రూ. 15 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్‌కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాశిష్ అనే వ్యక్తి విట్టీ ఇంజనీర్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లోని పోస్టు ప్రకారం.. నోయిడా సెక్టార్ 124 కు వర్చువల్ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్స్ ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ ధరను చూశారు. 4 BHK ఫ్లాట్ ధరను రూ. 15 కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది. అలాగే 6 BHK ఫ్లాట్ ధర 25 కోట్లు అని ఉంది.
ఇది చూసిన కాశిష్.. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఈ అపార్ట్‌మెంట్‌లు ఎవరు కొంటున్నారో ఆశ్యర్యం వేస్తుంది.. వారు ఏ పని చేస్తారని ప్రశ్నించారు. నేను అయితే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా, ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో 4BHKను కొనుగోలు చేయగలనా?" అని పేర్కొన్నాడు.
ఈ వీడీయో వైరల్‌గా మారింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అపార్ట్‌మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్‌లు పెట్టారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు పేర్కొన్నగా.. 15 కోట్లతో యూరప్ లేదా యూఎస్‌లో పౌరసత్వంతోపాటు ఎక్కడైన ఒక అపార్ట్‌మెంటే కొనవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది ల్గజరీ ప్రాజెక్ట్ అని, విశాలమైన ప్రదేశం, విలాసవంతమైన సౌకర్యాల వల్ల అంత ధర ఉందని వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment