high cost
-
4 BHK ఫ్లాట్ ధర రూ. 15 కోట్లు.. నోయిడా టెక్కీ పోస్టు వైరల్
నోయిడా: రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయినా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి. సొంతింటిలో జీవించడం ప్రతి ఒక్కరి కల కావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయ పడుతుంటారు.ఇక లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనడమంటే కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ఇంటి ధర తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా రూ. 15 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.కాశిష్ అనే వ్యక్తి విట్టీ ఇంజనీర్ అనే ఇన్‌స్టా అకౌంట్లోని పోస్టు ప్రకారం.. నోయిడా సెక్టార్ 124 కు వర్చువల్ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్స్ ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ధరను చూశారు. 4 BHK ఫ్లాట్ ధరను రూ. 15 కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది. అలాగే 6 BHK ఫ్లాట్ ధర 25 కోట్లు అని ఉంది. ఇది చూసిన కాశిష్.. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఈ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారో ఆశ్యర్యం వేస్తుంది.. వారు ఏ పని చేస్తారని ప్రశ్నించారు. నేను అయితే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా, ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో 4BHKను కొనుగోలు చేయగలనా?" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Witty Engineer (@wittyengineer_) ఈ వీడీయో వైరల్‌గా మారింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అపార్ట్మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు పేర్కొన్నగా.. 15 కోట్లతో యూరప్ లేదా యూఎస్‌లో పౌరసత్వంతోపాటు ఎక్కడైన ఒక అపార్ట్‌మెంటే కొనవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది ల్గజరీ ప్రాజెక్ట్ అని, విశాలమైన ప్రదేశం, విలాసవంతమైన సౌకర్యాల వల్ల అంత ధర ఉందని వివరిస్తున్నారు. -
‘ప్రైవేట్’ బాదుడు..
సాక్షి, హైదరాబాద్:దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల దోపిడీ పట్టపగలే చుక్కలు చూపింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై గుదిబండ మోపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్ల నుంచి పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 2000 బస్సులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. వీటిల్లోనూ టికెట్ ధరపై 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో 3,800 బస్సులకుగాను ఆదివారం 1,200 బస్సులే రోడ్డెక్కాయి. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. శని, ఆదివారాలు కలిపి గ్రేటర్ ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని అతికష్టం మీద కొన్ని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు అందినకాడికి దండుకున్నారు. సుమారు 127 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో 1.75 లక్షల మంది వరకు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. ఆదివారం సుమారు 4 లక్షల మంది మెట్రో జర్నీ చేశారని అధికారులు అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వే స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. -
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు
సాక్షి, ఆమదాలవలస రూరల్ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ధరలు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాంసం ప్రియులకు చేదు వార్త కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ధరలు అదుపు చేయాలి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కూన రామకృష్ణ, కృష్ణాపురం ఏమీ కొనే పరిస్థితి లేదు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. -బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం -
‘చెప్పులకు కాపలాగా ఇద్దరు గన్మెన్లు’
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వస్తువులను వినియోగించాలని ఆశపడటం సహజమే. సంపన్నులే కాకుండా మధ్యతరగతి జీవులు సైతం నెలనెలా వాయిదా పద్ధతుల్లో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఊహించిన ధరలతో మార్కెట్లోకి వచ్చే వస్తువులు.. అత్యంత పేలవంగా ఉంటే ఎలాంటి కామెంట్లు వచ్చిపడతాయో..! ఈ చెప్పుల జత గురించి చదివి తెలుసుకుందాం.. వాలెంటినో, హవాయినస్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఓ చెప్పుల జత ధర అక్షరాల రూ.45 వేలు. ధర ఇంత భారీగా ఉంటే ఆ చెప్పులు మరెంత సౌకర్యవంతంగా ఉంటాయోననీ ఊహించుకోకండి. అదంతా వట్టి ట్రాష్ అని ఈ ‘ఖరీదైన’ చెప్పుల జతపై కామెంట్లు పేలుతున్నాయి. అమెజాన్ వెబ్సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న పలువురు అసహనంతో కూడిన జోకులు విసురుతున్నారు. ఫన్నీ కామెంట్లు.. ‘మీకెవరి మీదనైనా పగ తీర్చుకోవాలి అనుకుంటే వారి వివరాలతో క్యాష్ ఆన్ డెలివరీపై చెప్పులను ఆర్డర్ చేయండి. 45 వేలు కట్టలేక వాళ్లు కళ్లు తేలేస్తారు. ఇక పీడ విరగడవుతుంది. మళ్లీ మీ జోలికి రారు. ఖరీదైన చెప్పులు కాబట్టి గుళ్లూ, గోపురాలకు వెళ్లినప్పుడు కాపలాగా ఇద్దరు సాయుధులను వాటికి కాపలాగా పెడుతున్నాను. మా బాస్ ఆఫీస్‌కి ఎప్పుడూ ఆలస్యంగా వస్తావ్ అంటూ రొద పెడతాడు. ఇప్పుడు ఈ చెప్పుల కారణంగా ఎక్కడా నిముషం కూడా ఆగకుండా పరుగెత్తుకుంటూ ఆఫీస్‌కు చేరుతున్నాను’ ఇది ఓ వినియోగదారుడి వ్యథ. ఇక.. ఈ చెప్పులు కొనేందుకు బైక్‌ను అమ్ముకున్నానంటూ ఒకరు.. మారుతి 800 అమ్ముకున్నానని మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ చెప్పినట్టు చెప్పులు గొప్పగా ఏం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి మామూలు చెప్పులేననీ, కాకపోతే కాస్త సౌకర్యవంతంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్మీ ఉత్పత్తుల్లో వాడే మెటీరియల్, ఫుచియా రబ్బర్‌తో వీటిని తయారు చేశారు. ఒక వ్యక్తి మూడు జతలు మాత్రమే ఆర్డర్ చేయాలని అమెజాన్ తన వెబ్సైట్లో పేర్కొనడం కొసమెరుపు. విశేషమేమంటే ఈ చెప్పులు పురుషుల వాడకం కోసం తయారు చేశారు. -
బస్టాండ్లు..అక్రమదందాలకు అడ్డాలు..!
-
మిరప కొరకకుండానే కళ్లకు నీళ్లు
-
భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు
శునకంతో మనిషికున్న అనుబంధం ప్రత్యేకమైంది. మానవుడు ఎన్ని జంతువులను మచ్చిక చేసుకున్నా మనుషులతో మమేకమవడంలో వీటిదే అగ్రస్థానం. ఇవి మానవులతో సమానమైన భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని ఇటీవలి జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనకు నేస్తాలుగా, ఇంటికి కాపలాగా, నేరస్తులను పట్టించే జాగిలాలుగా.. ఎంతో సేవచేస్తున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం..! టూమచ్ కాస్ట్! టిబెట్‌కు చెందిన మాస్తిఫ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకం. ఈ జాతి కుక్కలు ఎక్కువ బొచ్చుతో చాలా పెద్దగా ఉంటాయి. చైనీయులకు వీటిపైన మక్కువ పెరిగి పోవడమే వీటి డిమాండ్‌కు కారణం. ఇవి ఏ ఇంటిలో ఉంటే ఆ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయని చైనీయుల నమ్మకం. అందరూ వీటిని ఇష్టపడటం, వీటి జాతి క్రమేణా తగ్గిపోవడం.. కూడా వీటి ధర చుక్కలనంటడానికి మరో కారణం. గతంలో జర్మన్ షెఫర్డ్ జాతి కుక్క అధిక వ్యయమని అందరూ భావించేవారు. ఇప్పుడు ఆ రికార్డును మాస్తిఫ్ బద్దలుకొట్టింది. నివసించే ప్రాంతం: ఇవి టిబెట్‌లో పుట్టాయి. టిబెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించకుండా కాపాడుతున్నవి ఈ శునకాలేనట. చప్పిడి ముక్కు, పొడవుగా ఉండే నోరు.. వీటి కుండే బొచ్చుతో మూసుకుపోయి ఉంటాయి. ఆ దేశంలో ఉండే మత సన్యాసుల వెంట ఇవి కాపలాగా తిరుగుతుంటాయి. వారికి పూర్తి స్థాయి రక్షణకు కల్పిస్తున్నాయి. ఎక్కువ బలంగా ఉండి, ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొంటాయి. ఎక్కడైనా జీవించగలవు: బాగా ఎత్తుగా ఉండే పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. అలాగే సాధారణ మైదాన ప్రాంతాల్లోనూ జీవించగలవు. చాలా మంది వీటిని పెంచుకోవడం ఒక సంప్రదాయంగా భావిస్తారు. చైనాలో బాగా ధనవంతుల ఇళ్లలో ఈ జాతి శునకాలు కనీసం 20కి తక్కువ కాకుండా ఉంటాయట. వీటిలో చిన్న కుక్కపిల్లే సుమారుగా రూ. 6 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ఇది పెరిగి పెద్దదైతే దీని ధర ఎంతైనా ఉండొచ్చు. ఇటీవల చెనాకు చెందిన బొగ్గు గనుల ఆసామి యాంగ్ ఈ శునకాన్ని అక్షరాలా రూ. 9 కోట్ల 40 లక్షలు పెట్టి ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేశారు. సినిమాలంటే పిచ్చి: తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామంలో భాస్కర థియేటర్ కేరాఫ్ అడ్రస్‌గా చేసుకుని ఒక కుక్క నివసిస్తోంది. అది రోజూ ఆ థియేటర్లో ఆడే నాలుగు షోలూ ఒక్కటి కూడా మిస్సవకుండా వీక్షిస్తుందట. అది ఎక్కడో ఒక మూలన ఉండి కాదు.. దర్జాగా కుర్చీలో కూర్చునే. సినిమా థియేటర్ గేటు తెరచిన శబ్దం వినగానే లోపలికి ప్రవేశిస్తుంది. ఇంటర్వెల్లో బయటకు రావడం, షో మొదలవ్వగానే లోపలికి పరుగెత్తడం దీనికి రోజూ మామూలేనట. దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఆ థియేటర్ యజమాని కూడా ఆ శునకాన్ని చేరదీస్తున్నాడట. బుల్లి శునకం: ప్రపంచంలో అత్యంత చిన్న శునకం పేరు చిహ్వాహ్వా. పేరు నోరు తిరగడం లేదు కదూ! ఇది ఎంత చిన్నదంటే కేవలం 6 నుంచి 9 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చిన్నది కదా అని చిన్నచూపు చూసేరు.. ఇది కరిస్తే మిగిలిన జాతుల కంటే రాబిస్ వచ్చే ప్రమాదం అధికమట. పెద్ద శునకం: ప్రపంచంలో అత్యంత పెద్ద శునకం ఇంగ్లిష్ మేస్టిన్. దీని బరువు 158 కిలోలు. విగ్రహం: కుక్కకి విగ్రహం పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మనుషుల్లోనే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే ఇలాంటి అదృష్టం ై‘లెకా’ అనే కుక్క పిల్ల కొట్టేసింది. ఇంతకి ఎవరీ లైకా అనుకుంటున్నారా? అంతరిక్షంలోకి మానవులు వెళ్తే మనం గొప్పగా భావిస్తున్నాం. లైకా అనే ఈ శునకం మానువుల కంటే ముందే అంతరిక్షంలో అడుగుపెట్టి ఆ క్రెడిట్ కొట్టేసింది. అంతరిక్షంలో పరిస్థితులు తెలుసుకోవడం కోసం వ్యోమగాములు ముందుగా దీన్ని అంతరిక్షంలోకి పంపారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చనిపోయింది. ఓ బృహత్తర కార్యం సాధించడంలో మానవులకు మార్గదర్శకంగా నిలిచి ఆ కార్యక్రమంలో అశువులు బాసిన దీని విగ్రహాన్ని ఇటీవల మాస్కోలో ప్రతిష్టించారు. 1953 నవంబర్ 3న లైకా అంతరిక్షయానం చేసింది. ఎత్తైన శునకం: ప్రపంచంలోనే ఎత్తైన కుక్క జాతి గ్రేట్ డేన్. ఎత్తుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందాల పోటీలు: ప్రతి ఏటా చాలా నగరాల్లో డాగ్షోలు జరుగుతాయి. వీటిలో శునకాలు సైతం ర్యాంప్ వాక్ చేస్తాయి. వాటి అందం, ప్రదర్శించిన విన్యాసాలను బట్టి వాటిలో విజేతలుగా ప్రకటించి బహుమతులు అందచేస్తారు.