గంగాధర(చొప్పదండి): చదువంటే ఇష్టం లేక, హాస్టల్‌లో ఉండలేక ఓ పదో తరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో ఆంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యతి్నంచింది. అయితే ప్రాణాపాయం తప్పిపోగా, కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గంగాధర ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన స్వప్న– లక్ష‍్మీనారాయణ కూతురు హాసిని గంగాధర మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది.
అయితే చదువంటే ఇష్టం లేదని, హాస్టల్‌లో ఉండనని మొండికేసి కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తెను బ్రతిమిలాడి ఒప్పించి ఐదురోజుల క్రితం హాస్టల్‌లో చేర్పించి వెళ్లారు. ఆదివారం సాయంత్రం హాసిని వసతిగృహం మూడో అంతస్తుపైకి వెళ్లింది. అక్కడికి ఎవరూ రాకుండా తలుపులు బిగించి వెళ్లి రెయిలింగ్‌పై కూర్చొంది. ఉపాధ్యాయు లు, విద్యార్థులు గమనించి వారించినా వినకుండా పైనుంచి దూకేసింది. అయితే ఎడమకాలు విరిగి, ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన హాసినిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment