శ్వేతనాగవేణి ఎక్కడికి వెళ్లింది!? | betech student shwetha nagaveni missing case | Sakshi
Sakshi News home page

శ్వేతనాగవేణి ఎక్కడికి వెళ్లింది!?

Published Sat, Aug 27 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

శ్వేతనాగవేణి (ఫైల్‌)

శ్వేతనాగవేణి (ఫైల్‌)

జగద్గిరిగుట్ట: కాలేజీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని అదృశ్యమైంది. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం... అల్విన్‌కాలనీ ధరణినగర్‌కు చెందిన నాగార్జునాచార్యులు కుమార్తె శ్వేత నాగవేణి (24) బహదూర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. ఈనెల 26న ఉదయం కాలేజీకి అని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన నాగవేణి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం అన్ని చోట్లా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement