శ్వేతనాగవేణి ఎక్కడికి వెళ్లింది!?
జగద్గిరిగుట్ట: కాలేజీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యమైంది. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం... అల్విన్‌కాలనీ ధరణినగర్కు చెందిన నాగార్జునాచార్యులు కుమార్తె శ్వేత నాగవేణి (24) బహదూర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఈనెల 26న ఉదయం కాలేజీకి అని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన నాగవేణి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం అన్ని చోట్లా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.