
సాక్షి, విశాఖపట్నం: రైలు ఎక్కుతున్నప్పుడు లేదా దిగి క్రమంలో జాగ్రత్తలు వహించాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, వారి హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు అజాగ్రత్తతో ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికి చాలానే చూశాము.
తాజాగా ఇలాంటి ఘటనే గాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్, రైలులో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంది.
కాగా, విద్యార్ధిని రైలు మధ్యలో పడిపోవడంతో ఆమెను బయటకు తీసెందుకు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment