బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం | Nepal Student Molestation on Btech Student in Rangareddy | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం

Published Fri, Dec 14 2018 12:36 PM | Last Updated on Fri, Dec 14 2018 12:36 PM

Nepal Student Molestation on Btech Student in Rangareddy - Sakshi

ఇబ్రహీంపట్నం: ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థినిపై నేపాల్‌ దేశానికి చెందిన సహచర విద్యార్థి అత్యాచారం చేశాడు. అనంతరం అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగింది. గురువారం సీఐ గురుశారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.

నిజమాబాద్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సహచ విద్యార్థి అయిన నేపాల్‌ దేశానికి చెందిన ఆరిఫ్‌అన్సారీ(22) ఆమెతో స్నేహిం చేశాడు. విద్యార్థినిని నమ్మించి ఇబ్రహీంపట్నంలోని తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యార్థికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు ఈనెల 10 ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటి, ఆత్యాచారం కేసులను  నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement