తూర్పుగోదావరి జిల్లా కోరంగిలో అభినందన ర్యాలీ నిర్వహిస్తున్న కైట్ కళాశాలల విద్యార్థినులు
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ కైట్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థినులు శుక్రవారం అభినందన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోగల కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సుమారు 1,500 మందికిపైగా విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం, థాంక్యూ జగన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఇరవై వేలు ప్రకటించడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment