మృతుడు పవన్(ఫైల్)
తాటిచెట్లపాలెం/కూర్మన్నపాలెం(విశాఖపట్నం): నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న చట్టి పవన్‌కుమార్(20) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మర్రిపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాల పక్కన అతని మృతదేహం లభ్యమైంది. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివీ.. వడ్లపూడి నిర్వాసితకాలనీ అప్పికొండ ప్రాంతానికి చెందిన చట్టి రామునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అతని చిన్న కుమారుడు పవన్‌ను కళాశాలకు పంపించేందుకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కూర్మన్నపాలెం బస్టాండ్‌లో దించాడు. మధ్యాహ్నం సమయంలో కుమారుడికి తండ్రి ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. కాగా.. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ మర్రిపాలెం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన జీఆర్పీ సీఐ కోటేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్‌ఐ కామేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పవన్ మృతదేహాంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉన్నత చదువులు చదివి.. గొప్పస్థాయికి ఎదుగుతాడన్న కుమారుడు ఇక రాడనే వార్త ఆ తల్లిదండ్రులను కలచి వేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు.
కాగా.. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు పవన్ మేసేజ్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ‘అమ్మానాన్న సారీ.. నా వల్ల మీకెప్పుడైనా బాధలు తప్పవు.. అందుకే వెళ్లిపోతున్నా..’అంటూ అందులో పేర్కొన్నాడు. అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ కామేష్ తెలిపారు.
చదవండి: క్లాస్‌మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్‌యూ అంటూ సహజీవనం.. తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment