
ఆదిత్య
నెల్లూరు(క్రైమ్): ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యమైన ఘటనపై నాల్గో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. దర్గామిట్ట ఎంజీమాల్ వెనుక వైపునున్న ఓ అపార్ట్‌మెంట్‌లో పి.మధుసూదనరావు కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కుమారుడు ఆదిత్య చెన్నైలోని ఏవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది మార్చి 15న సెలవుపై చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చాడు. పది రోజులు ఇంట్లో గడిపాడు. అదే నెల 25న చెన్నై వెళ్లేందుకు మధుసూదన్‌రావు కుమారుడిని ఆర్టీసీ బస్సు ఎక్కించి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆదిత్య ఆచూకీ తెలియరాలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో నాల్గో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment