![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/19/55.jpg.webp?itok=GxLTvHUa)
ఘట్‌కేసర్: బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిన సంఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిఽ మతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...ఆర్‌కే పురం, కొత్తపేట్‌కు చెందిన సి.హెచ్ విగ్నేశ్ (22) అవుషాపూర్ వీబీఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శనివారం ఎదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్ద స్నేహితులు హరీశ్, శశాంక్, సాయిరాంతో కలిసి విందు చేసుకున్నారు.
విందు అనంతరం సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఇంటికి వెళుతుండగా హెచ్‌ఎండీఏ నర్సరీ సమీపంలో ఓఆర్‌ఆర్ వద్ద విగ్నేశ్ ప్రయాణిస్తున్న కేటీఎం బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment