ఆస్పత్రిలో గోపికి నగదు అందిస్తున్న కళాశాల యాజమాన్యం
♦ అంతుపట్టని వ్యాధితో ఇబ్బంది పడుతున్న
♦ ఇంజినీరింగ్ విద్యార్థి
♦ వెంటాడుతున్న పేదరికం
♦ సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
పాలకొండ రూరల్ : చక్కగా చదువుకుంటున్న ఆ కుర్రాడి జీవితం ఇప్పుడు దుర్భరంగా మారింది. అంతుచిక్కని వ్యాధి ప్రాణాలు హరించేలా వేదనకు గురిచేస్తోంది. బిడ్డ చదువు కోసమే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు చికిత్స ఖర్చు తలకు మించిన భారమవుతోంది. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ అమ్మానా న్నలు సాయం కోరుతున్నారు.
పాలకొండ మండలం చిన్న మంగళా పురం గ్రామంలో నిరుపేద జాలరి కు టుంబానికి చెందిన గునిశెట్టి గోపి చదువుల్లో బాగా రాణించేవాడు. స్వగ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలోనే చదివి పదో తరగతిలో 8.8 పాయింట్లు సాధించాడు. పాలకొండ పట్టణంలో ఓంసాయి కళాశాలలో ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీలో 943 మార్కులు సాధించి ఉన్నత స్థాయి వైపు అడుగులు వేశాడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇంజినీరింగ్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. అంతా చ క్కగా సాగుతున్న తరుణంలో విద్యార్థిని అం తు పట్టని వ్యాధి కబళించడం మొదలు పెట్టింది. విద్యార్థి కడుపులో భారీ కణితి ఏర్పడింది. అది లోపలనే చితికిపోవటంతో పరిస్థితి విషమించి ప్రాణాపాయంగా మారింది. నిత్యం కడుపునొప్పితో బాధ పడుతున్న గోపీని వైద్యులకు చూపించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు తల్లితండ్రులు శంకరరావు, రవణమ్మ తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన వీరికి గోపికి వచ్చిన సమస్యను వైద్య పరంగా పరిష్కరించేందుకు దాదాపు రూ.5లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పటంతో నోట మాట రాలేదు. తమ కుమారునికి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాలో తెలీక వీరు మదన పడుతున్నారు. లక్షల్లో సొమ్ములు కట్టే స్థోమత లేక సాయం అర్థిస్తున్నారు. గోపి ఇంటర్ పూర్తిచేసిన ఓం సాయి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు మంగళవారం రూ.73వేలు చందాలుగా సేకరించి ఆర్థిక సాయం అందించారు. ఇంకా రూ.ఐదు లక్షలు అవసరం కావటంతో దాతల కోసం ఎదురు చూస్తోంది.
చేయదలచుకున్న వారు 91005 08843, 99666 93534 నంబర్లకు ఫోన్ చేయాలని వీరు కోరుతున్నారు.