elusive disease
-
కరీంనగర్ జిల్లా: నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురి మృతి
-
అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్లో కుటుంబం బలి
సాక్షి, కరీంనగర్: అంతుచిక్కని వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం బలైంది. ఒకే వ్యాధితో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన గంగాధర మండల కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు..గంగాధరకు చెందిన లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. నవంబర్ నెలలో మొదట శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు విరేచనాలు, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తనయుడి మరణం నుంచి కోలుకోకముందే శ్రీకాంత్ కూతురు అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్9న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. ఇటీవల ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. భార్య, పిల్లల మృతితో అనారోగ్యానికి గురైన శ్రీకాంత్ కూడా శనివారం ఉదయం ఇంట్లో రక్తం కక్కుకొని మరణించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతుల రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కుటుంబానికి బలితీసుకున్న వ్యాధి ఏంటనేది మిస్టరీగా మారింది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. మరోవైపు అంతుచిక్కని వ్యాధిపై గంగాధర స్థానికల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. -
ములుగు జిల్లాలో మరో అంతుచిక్కని వ్యాధి
సాక్షి, ములుగు: అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో జనాలు మరణిస్తున్న సంఘటన ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. అసలేంటో తెలియని ఈ రోగం ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విస్మయపరుస్తోంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలు ఉండగా, 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ముందు రోజు జ్వరానికి గురైన వీరంతా కేవలం రెండ్రోజుల్లోనే కడుపు ఉబ్బి చనిపోయారు. ఇప్పటి వరకూ వీరి మరణాలకు కారణాలేంటో తెలియరావట్లేదు. కాలనీకి చెందిన వారు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండటంతో మిగతా కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, కలుషిత నీరే కారణమై ఉండొచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ఈ చిన్నారికి ఎంత కష్టం
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన వయసులో ఆ చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. చేతులు, కాళ్లకు వాపు రావడంతో నడవలేకపోతోంది. ఇంటి వద్ద మంచానికే పరిమితమైంది.ఆడుకోవడానికి శరీరం సహకరించకపోవడంతో తల్లడిల్లిపోతోంది. తాను కూడా బడికి పోతానని, ఆడుకుంటానని.. ఆ చిన్నారి మారాం చేస్తుంటే తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు. చిన్న వయస్సులోనే సోకిన పెద్ద జబ్బును చెప్పలేక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సాక్షి, కోడుమూరు(కర్నూలు) : కల్లపరి గ్రామానికి చెందిన జంగం చంద్రయ్య, లలితమ్మ దంపతులకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. ప్రతి రోజూ కూలికెళితేగాని పూటగడవని పరిస్థితి వారిది. వారి కుమార్తె జయలక్ష్మి ఎంతో చురుకుగా ఉండేది. ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఆటలాడుకుంటుంటే తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఐదేళ్ల వయస్సులో కల్లపరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రెండేళ్ల పాటు ఎంతో చక్కగా జయలక్ష్మి చదువుకుంది. అయితే గత ఏడాది మార్చి నెలలో చిన్నారికి ఉన్నట్టుండి ముఖం, కాళ్లు, చేతులు, గొంతు మొత్తం వాపు రావడం ప్రారంభించాయి. భయపడిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపుత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కిడ్నీ వ్యాధని డాక్టర్లు చెప్పడంతో రూ.3లక్షలకు పైగా అప్పులు చేసి బళ్లారి, రాయచూరు తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. మాత్రల కోసం నెలనెలా రూ.5వేలకు పైగా ఖర్చు వస్తోంది. కూలినాలి చేసిన డబ్బులన్నీ పాప వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. రోగం నయం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఎవ్వరైనా సాయం చేయదలచిన వారు జంగం లలిత, కెనరా బ్యాంకు, అకౌంట్ నెం : 1679101011237లో డిపాజిట్ చేయాలని వేడుకుంటున్నారు. వివరాలకు సెల్ నెం : 9502127063 సంప్రదించాలని కోరుతున్నారు. -
మాయదారి రోగం..హడలిపోతున్న ప్రజలు
‘‘మాయదారి రోగం మా ఊర్లో పశులన్నింటినీ మింగేస్తోందయ్యా.. ఏం రోగమో అంతుబట్టడడం లేదు. బాగానే ఉంటాయి.. రాత్రి పడుకున్న ఆవు తెల్లారేసరికి చనిపోతోంది. పశువుల డాక్టరు మాఊరికి వచ్చి మూడేళ్లకు పైగా అవుతోంది. ఏదైనా ఉంటే అటెండర్‌కు ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి రెండు సెలైన్లు పెడతాడు. అయినా తెల్లారేసరికి చనిపోతున్నాయి. వేణుగోపాలసాగర్ ప్రాజెక్టులో మా భూములన్నీ పోయాయి. బతికేందుకు వేలకు వేలు అప్పులు చేసి నాలుగు ఆవులు, గేదెలను కొనుక్కున్నాం. ఒక్కొక్కటి ఇలా చనిపోతుంటే మేం ఎట్లా బతకాలయ్యా.. ఆ మాయదారి రోగమేదో మాకు వస్తే బాగుండేది.. ఈ బాధలన్నీ లేకుండా హాయిగా ఊపిరి వదిలేస్తాం...’’ ఇదీ పుత్తూరు మండల పరిధిలోని తడుకు పంచాయతీకి చెందిన పాడి రైతుల ఆవేదన. సాక్షి, పుత్తూరు: తడుకు పంచాయతీ.. తిరుపతి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ పంచాయతీ పరిధిలోనే వేణుగోపాలసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీంతో వేణుగోపాలపురం, టీఆర్ కండ్రిగ కాలనీ, ఎస్టీ కాలనీలోని రైతులు తమ భూముల్ని ప్రాజెక్టులో భాగంగా కోల్పోయారు. నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో జీవనాధారం కోసం పాడిపై ఆధారపడుతున్నారు. ఆవులు, గేదెలను పోషించుకుంటూ సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పాడి రైతుల జీవితాలను అతలాకుతలం చేసే కష్టం వచ్చిపడింది. పాడి పశువులు ఒక్కొక్కటే వింతరోగంతో మృతి చెందుతుండడంతో ఏమి చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. వేలకు వేలు అప్పు చేసి కొనుగోలు చేసిన పశువులు కళ్లెదుటే మృత్యువాత పడుతుండడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. కబళిస్తున్న వింత రోగం భూములు కోల్పోయాక రైతులు పశుపోషణ ఒక్కటే జీవనాధారమైంది. దీంతో అప్పులు చేసి మరీ రైతులు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. గ్రామంలో ప్రస్తుతం వెయ్యికి పైగా పశువులు ఉన్నాయి. రెండేళ్లలో దాదాపు 40 పశువులు చనిపోయాయి. రెండు నెలలుగా వారానికి రెండు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల కథనం మేరకు.. ‘‘పశువులు ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మేత కూడా బాగానే తీసుకుంటున్నాయి. అయితే రాత్రికి రాత్రే అస్వస్థతకు గురవుతున్నాయి. సమీపంలో ఉన్న పశువైద్యశాఖకు చెందిన అటెండర్‌కు సమాచారం అందిస్తే రెండు సెలైన్లు ఎక్కిస్తున్నారు.ఆ తరువాత కొంత సమయానికే మృతి చెందుతున్నాయి.. రోగమేమనేది అంతుచిక్కడం లేదు’’ అని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గేదెలు, ఆవులు ఉన్న పాడి రైతుకి ఇప్పుడు ఒక్కటి కూడా మిగలలేదని వాపోతున్నారు. కొనుగోలుకు చేసిన రుణం అలాగే ఉందని, పశువులు మాత్రం మృతి చెందుతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రామం ముఖం చూసి మూడేళ్లు పశుసంపద ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామానికి పశువైద్యాధికారి వచ్చి మూడేళ్లుకు పైగా అవుతోందని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. ఏ రోగమొచ్చినా అటెండర్ దిక్కుగా మారారని పేర్కొంటున్నారు. ఇన్ని పశువులు మృతి చెందుతున్నా పశువైద్యశాఖ వైద్యులు గ్రామానికి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కేవలం పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇకనైనా పశువైద్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పుత్తూరు పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రమౌళి గౌడ్ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
పేద బిడ్డకు పెద్ద జబ్బు
కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే ఆ నిరుపేద కుటుంబాన్ని విధి వెంటాడింది. కుటుంబంలో అందరికీ సపర్యలు చేసే ఇల్లాలికి మాయదారి జబ్బు వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు అంతుచిక్కని వ్యాధితో ఆమె విలవిల్లాడుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులు భార్యకు మందులు, పిల్లల చదువులకు సరిపోక ఆ కుటుంబం పడే వేదన అంతాఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలంలోని అమీనాపురానికి చెందిన రమ కన్నీటి గాథ ఇదీ.. – కేసముద్రం గ్రామానికి చెందిన మట్టె ఉపేందర్, రమకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు వినయ్, కుమార్తె శిరీష ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనికి వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వారి కుటుంబాన్ని మాయదారి జబ్బు శాపంగా పరిణమించింది. రమ అనారోగ్యానికి గురికాగా, ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మందులు వాడినా ఫలితం లేకపోయింది. చికిత్స కోసం పలుమార్లు ఆస్పత్రులను ఆశ్రయించారు. అప్పటికే చేతిలో ఉన్న డబ్బులతోపాటు, అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చుపెట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.2లక్షల వరకు డబ్బులను వెచ్చించినప్పటికీ జబ్బు ఏమాత్రం కుదుట పడలేదు. పైగా వ్యాధి తగ్గకపోగా రెండు కాళ్లు చచ్చుబడడంతో నడవలేని పరిస్థితితో రమ మంచం పట్టింది. క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కొంత మంది వైద్యులు బోన్ టీబీ అని పేర్కొనగా, మరికొందరు ఆ వ్యాధి గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు బాధితులు తెలిపారు. చివరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా స్కానింగ్ తీసి, మం దులు ఇచ్చారు. జబ్బు ముదిరిందని మందు లు వాడాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నా రు. ఇలా ఆరేళ్లుగా ఇంట్లోనే రమ మంచానికే పరిమితమైంది. భర్త ఉపేందర్ రమకు అన్ని విధాలుగా సపర్యలు చేస్తూ, కుమారుడిని ఇంటర్మీడియట్, కూతురిని కేసముద్రంస్టేషన్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదివిస్తున్నాడు. ఉపేందర్ మండల కేంద్రంలోని ఇనుప సామగ్రి కొట్టులో పనిచేస్తూ.. ప్రతిరోజు వచ్చే రూ.180 కూలి డబ్బు లతో కుటుంబసభ్యులను పోషిస్తున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దగ్గరలోని ఆస్పత్రుల్లో ఇచ్చే మందులు వాడుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూస్తే.. అందరి హృదయాలు బరువెక్కక మానవు. ఇక ప్రతిరోజు ఆ ఇల్లాలు పడే నరకయాతన చూసి.. కుటుంబ సభ్యులు కన్నీళ్లను దిగమింగుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మనసున్న దాతలు ఎవరైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉ పేందర్, కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. -
మా..వేదన వినండి
♦ అంతుపట్టని వ్యాధితో ఇబ్బంది పడుతున్న ♦ ఇంజినీరింగ్ విద్యార్థి ♦ వెంటాడుతున్న పేదరికం ♦ సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు పాలకొండ రూరల్ : చక్కగా చదువుకుంటున్న ఆ కుర్రాడి జీవితం ఇప్పుడు దుర్భరంగా మారింది. అంతుచిక్కని వ్యాధి ప్రాణాలు హరించేలా వేదనకు గురిచేస్తోంది. బిడ్డ చదువు కోసమే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు చికిత్స ఖర్చు తలకు మించిన భారమవుతోంది. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ అమ్మానా న్నలు సాయం కోరుతున్నారు. పాలకొండ మండలం చిన్న మంగళా పురం గ్రామంలో నిరుపేద జాలరి కు టుంబానికి చెందిన గునిశెట్టి గోపి చదువుల్లో బాగా రాణించేవాడు. స్వగ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలోనే చదివి పదో తరగతిలో 8.8 పాయింట్లు సాధించాడు. పాలకొండ పట్టణంలో ఓంసాయి కళాశాలలో ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీలో 943 మార్కులు సాధించి ఉన్నత స్థాయి వైపు అడుగులు వేశాడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇంజినీరింగ్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. అంతా చ క్కగా సాగుతున్న తరుణంలో విద్యార్థిని అం తు పట్టని వ్యాధి కబళించడం మొదలు పెట్టింది. విద్యార్థి కడుపులో భారీ కణితి ఏర్పడింది. అది లోపలనే చితికిపోవటంతో పరిస్థితి విషమించి ప్రాణాపాయంగా మారింది. నిత్యం కడుపునొప్పితో బాధ పడుతున్న గోపీని వైద్యులకు చూపించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు తల్లితండ్రులు శంకరరావు, రవణమ్మ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన వీరికి గోపికి వచ్చిన సమస్యను వైద్య పరంగా పరిష్కరించేందుకు దాదాపు రూ.5లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పటంతో నోట మాట రాలేదు. తమ కుమారునికి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాలో తెలీక వీరు మదన పడుతున్నారు. లక్షల్లో సొమ్ములు కట్టే స్థోమత లేక సాయం అర్థిస్తున్నారు. గోపి ఇంటర్ పూర్తిచేసిన ఓం సాయి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు మంగళవారం రూ.73వేలు చందాలుగా సేకరించి ఆర్థిక సాయం అందించారు. ఇంకా రూ.ఐదు లక్షలు అవసరం కావటంతో దాతల కోసం ఎదురు చూస్తోంది. చేయదలచుకున్న వారు 91005 08843, 99666 93534 నంబర్లకు ఫోన్ చేయాలని వీరు కోరుతున్నారు. -
పాపం పసివాడు..!
► రోజురోజుకు పెరిగిపోతున్న పొట్ట ► అల్లాడిపోతున్న తల్లిదండ్రులు గూడెంకొత్తవీధి(పాడేరు): బాబు పుట్టాడని ఎంతో ఆనందించిన ఆ తల్లిదండ్రులకు ఆ సంబరం ఎంతోకాలం నిలువలేదు. పుట్టిన మూడు నెలల తర్వాత ఆ బిడ్డకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మండలంలోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట మగబిడ్డ పుట్టాడు. మూడు నెలల పాటు ఎంతో ఆరోగ్యంతో ఉన్న ఆ బిడ్డ, ఆ తరువాత కడుపు ఉబ్బరంతో తీవ్రంగా బాధపడుతున్నాడు. పాలుతాగినా, తాగకపోయినా పొట్ట రోజురోజుకు పెరిగిపోతుండంతో దిక్కు తోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. అసలే పేదరికం, ఆ పై పుట్టిన బిడ్డకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నరకయాతన పడుతున్నారు. ఇటీవల చింతపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యమందించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపారు. బాబుకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. అక్కడ రెండు రోజులపాటు చిన్నారిని ఆస్పత్రిలో ఉంచారు. తరువాత వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఇంటికి చేరుకున్నారు. బాబు పొట్ట 28 సెంటీమీటర్లు పొంగిపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతున్నప్పటికీ పొట్ట ఎందుకు ఉబ్బిపోతోందో తెలియక క్షోభ పడుతున్నారు. అంతుచిక్కిని వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.