అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి.. | Engineering student arrested on rape, blackmail charge | Sakshi

అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి..

Apr 1 2017 10:53 AM | Updated on Aug 20 2018 4:44 PM

అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి.. - Sakshi

అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి..

బాలికను చెరపట్టిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆపై దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలకు పాల్పడ్డాడు.

బొమ్మనహళ్లి: బాలికను చెరపట్టిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆపై దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలకు పాల్పడ్డాడు. ఈఘటన  శుక్రవారం బెల్గాం నగరంలో వెలుగుచూసింది.  బెల్గాం నగరంలోని బాళెకుంద్రి ఇంజినీరింగ్‌ కళాశాల్లో రెండవ సంవత్సరం చదువుతున్న  శివకుమార్‌ బాళెకుంద్రి (22) ఇదే నగరంలోని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ లో  రికార్డు చేశాడు.

తర్వాత ఆ దృశ్యాలను బయట పెడతానని బ్లాక్‌మెయిల్‌చేస్తూ  అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఓ పర్యాయం తన కోర్కె తీర్చేందుకు బాలిక అంగీకరించకపోవడంతో సెల్‌ఫోన్ లోని దృశ్యాలను పాఠశాలలోని కొందరు బాలికలకు చూపించాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement