
కడప కల్చరల్ : ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ గూగుల్‌లో ఓ లోపాన్ని కనుగొన్న వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోపాల్‌సింగ్, ఆ సమాచారాన్ని గూగుల్ సంస్థకు తెలియజేశాడు. తప్పును తమకు వెంటనే తెలియజేసినందుకు గూగుల్ యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించి గోపాల్‌సింగ్‌ను అభినందించింది. స్థానిక కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలో నాలుగో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న గోపాల్‌సింగ్ గుగూల్‌లోని ఓ ప్రత్యేకమైన లోపాన్ని కనుగొన్నారు. ఇందుకు గూగుల్ ప్రతినిధులు ఆయనకు 3133.70 డాలర్లు (రూ. 2.10 లక్షలు) నగదును బహుమతిగా ప్రకటించారు. ఈ లోపం ద్వారా గూగుల్‌తో పాటు ఆ సంస్థతో టైఅప్ అయిన కంపెనీల రహస్యాలను ఇతరులు చౌర్యం చేసే ప్రమాదం ఉందని, దాన్ని తాను గుర్తించి గూగుల్‌కు తెలియజేసినట్లు గోపాల్‌సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment