
బళ్లారి అర్బన్: గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు...బళ్లారి తాలూకా మోకా సమీపంలో గల బైరదేవనహళ్లి గ్రామానికి చెందిన రుక్మణ్‌రెడ్డి రెండో కుమారుడు ప్రతాప్ రెడ్డి (20) మైసూరులోని ఎన్‌ఐఈ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ప్రతాప్ రెడ్డి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment