కర్ణాటక: ఆకస్మిక గుండెపోటు మరణాలను అరికట్టేందుకు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరుతో ప్రత్యేక పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండురావు తెలిపారు. ఆదివారం గాంధీనగరలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లోనే కాకుండా బహిరంగ స్థలాల్లో కూడా ఎక్స్‌టెర్నల్ డిఫిబ్రిలేటర్ ఉపకరణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బస్టాండ్, రైల్వేస్టేషన్, మాల్, ఎయిర్‌పోర్టులు వంటి చోట్ల వీటిని ఉంచుతారు, గుండెపోటు వచ్చినప్పుడు ఆ పరికరం సాయంతో ప్రథమచికిత్స చేయవచ్చని చెప్పారు. అలాగే గుండెపోటు బాధితులను గంటలోపే ఆస్పత్రికి తీసుకెళ్తే మరణాలను అరిట్టవచ్చని తెలిపారు. రెండు వారాల్లోగా డిఫిబ్రిలేటర్ల ఏర్పాటుకు టెండర్ ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment