హొసపేటె: గుండెపోటుతో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా కమలాపుర పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న రాఘవేంద్ర(46) రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోతుండగా అర్ధరాత్రి ఉన్నఫళంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనిని నగర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేంద్ర 2005 బ్యాచ్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్. గత 18 ఏళ్లుగా పోలీసు శాఖలో విధులు నిర్వహించారు. ఇటీవలే బళ్లారి లోకాయుక్త కార్యాలయం నుంచి రాఘవేంద్ర పదోన్నతిపై కమలాపుర పోలీసు స్టేషన్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా బదిలీ అయ్యారు. కాగా విజయనగర జిల్లా ఎస్పీ శ్రీ హరిబాబు, డీఎస్పీ మంజునాథ్ తళ్వార్, హంపీ సీఐ కే.శివరాజ్ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment