ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య | - | Sakshi
Sakshi News home page

ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Published Sun, Jan 14 2024 1:18 AM | Last Updated on Sun, Jan 14 2024 10:10 AM

నిందితులు నితీశ్‌,          నందిని బాయి  - Sakshi

కర్ణాటక: ప్రియునితో కలిసి భర్తను హత్యచేసి, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసిన ఖతర్నాక్‌ భార్య, ఆమె ప్రియుడు నితీశ్‌ కుమార్‌ను హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు ఆగ్నేయవిబాగ డీసీపీ సీకే.బాబా శనివారం వివరాలను వెల్లడించారు. ఏపీలోని పుట్టపర్తి తాలూకాకి చెందిన నందిని బాయి, భర్త వెంకటరమణ నాయక్‌ (30) హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో నివాసం ఉండేవారు. వెంకటరమణ పగటివేళ ఒక షాపులో, రాత్రి వేళ ఓ ఇంటి సెక్యూరిటి గార్డుగా పనులు చేస్తూ కుటుంబ పోషణకు శ్రమించేవాడు. ఇదే సమయంలో భార్య నందినిబాయి తమ ఊరికే చెందిన ప్రియుడు నితీశ్‌ కుమార్‌ను తరచూ ఇంటికి పిలిపించుకునేది.

భర్త ఇంటికి తిరిగిరాగా
ఈ నెల 6వ తేదీన భర్త వెంకటరమణ విధులకు వెళ్లగా, నందినిబాయి ప్రియున్ని ఇంటికి పిలిపించింది. అయితే ఆ రోజు పనిలేదని కొంతసేపటికే భర్త తిరిగి వచ్చాడు. భార్య, ప్రియుడు పడకగదిలో ఉండడం చూసి వెంకటరమణ కోపంతో గొడవకు దిగాడు. భార్య, ఆమె ప్రియుడు కలిసి వెంకటరమణ తలపై రుబ్బుగుండుతో దాడిచేసి అంతమొందించి మృతదేహాన్ని టాయిలెట్లో పడేశారు. తరువాత పోలీసులకు ఫోన్‌చేసి తన భర్త గుండెపోటుతో మరణించాడని చెప్పింది. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి గుండెపోటు కాదని, హత్య అనే అనుమానం ఉందని తెలిపారు. పోలీసులు నందినిబాయిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకుని విచారణచే పట్టగా విషయం అంతా వివరించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.


హతుడు వెంకటరమణ (ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement