
సాక్షి, విజయవాడ: నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తరుణ్ అనే యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని బంధువులు అంటున్నారు. ప్రేమ పేరుతో తరుణ్ మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతిని కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలోనే ఉంచాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెల 23న యువతిని ఆస్పత్రిలో చేర్చి తరుణ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తరుణ్ పనిచేస్తున్నాడు. విద్యార్థిని స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామం.
Comments
Please login to add a commentAdd a comment