సీనియర్ రేప్ చేశాడని చెబితే.. క్లాస్మేట్ కూడా
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పుణెకు శివారున ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి సాయం చేయాల్సిందిగా మొదటి సంవత్సరం విద్యార్థినిని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించింది. సీనియర్ విద్యార్థి ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ తన గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి క్లాస్మేట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ అమ్మాయితో చెప్పాడు. మరుసటి రోజు బాధితురాలిని తన హాస్టల్ గదికి పిలిపించుకుని అతను కూడా లైంగికదాడి చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.