Senior student
-
సీనియర్ రేప్ చేశాడని చెబితే.. క్లాస్మేట్ కూడా
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పుణెకు శివారున ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి సాయం చేయాల్సిందిగా మొదటి సంవత్సరం విద్యార్థినిని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించింది. సీనియర్ విద్యార్థి ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ తన గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి క్లాస్మేట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ అమ్మాయితో చెప్పాడు. మరుసటి రోజు బాధితురాలిని తన హాస్టల్ గదికి పిలిపించుకుని అతను కూడా లైంగికదాడి చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. -
ఫొటోలు మార్పింగ్ చేసి.. ఫేస్బుక్లో పెట్టి
* విద్యార్థినిని డబ్బు డిమాండ్ చేసిన ‘సీనియర్’ * నిందితుడి అరెస్టు సాక్షి, హైదరాబాద్: జూనియర్ విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా (ఫేస్బుక్)లో అప్లోడ్ ఓ సీనియర్ విద్యార్థి వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకు జూనియర్ అయిన ఓ విద్యార్థిని ఫేస్బుక్ ఐడీ, పాస్వర్డ్ దొంగచాటుగా తెలుసుకున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి ఫేస్బుక్లో పెట్టాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ నిందితుడిన్న గుర్తించి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతని వద్ద లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న అశ్లీల చిత్రాలను తొలగించారు. ఈ విధంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. -
ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి
కోల్‌సిటీ: తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో సీనియర్ విద్యార్థినిపై జూనియర్ విద్యార్థి బ్లేడుతో దాడి చేశాడు. కాలేజీ ఆవరణలోనే ఈ దాడి జరగగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విషయం బహిర్గతం కావడంతో పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు సేకరించి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ కథనం మేరకు.. మార్కండేయ కాలనీలోని గాంధీ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని(20) బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఇదే కాలేజీలో స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కోయల శ్రీకాంత్(19) బీకాం సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలంగా ఇతడు సీనియర్‌ను ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. విద్యార్థినిని నిరాకరించడంతో గతంలో తన చేతిపై బ్లేడ్‌తో కోసుకుని గాయాలు చేసుకున్నాడు. సోమవారం కాలేజీలో విద్యార్థినిని తన ప్రేమ విషయంపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరిస్తూ కాలేజీపై అంతస్తులోని తరగతి గదిలో మర్చిపోయిన పుస్తకాలు తీసుకురావడానికి వెళ్లింది. వెనకాలే వెళ్లిన శ్రీకాంత్ ఆమెను అడ్డగించి తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో అరచెయ్యిపై కోసి పారిపోయాడు. రక్తం మరకలతో భయపడుతూ బయటకు పరుగులు తీసిన విద్యార్థినిని గమనించిన కాలేజీ యాజమాన్యం వెంటనే స్థానిక స్వతంత్రచౌక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. తీవ్రంగా గాయం కావడంతో సుమారు ఏడు కుట్లు పడ్డాయని తెలిసింది. ఈ దాడిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా, అలాంటి సంఘటన జరగలేదని, కాలేజీలో బెంచీ తగలడంతోనే విద్యార్థిని గాయపడిందని నిర్లక్ష్యంగా చెప్పారు. విషయం తెలిసిన వన్‌టౌన్ పోలీసులు బాధిత విద్యార్థినితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 326 క్లాజ్-ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇ.పద్మ, డీపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఖండించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిర్భయ చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.