కోల్‌సిటీ: తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో సీనియర్ విద్యార్థినిపై జూనియర్ విద్యార్థి బ్లేడుతో దాడి చేశాడు. కాలేజీ ఆవరణలోనే ఈ దాడి జరగగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విషయం బహిర్గతం కావడంతో పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు సేకరించి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ కథనం మేరకు.. మార్కండేయ కాలనీలోని గాంధీ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని(20) బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఇదే కాలేజీలో స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కోయల శ్రీకాంత్(19) బీకాం సెకండియర్ చదువుతున్నాడు.
కొంతకాలంగా ఇతడు సీనియర్‌ను ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. విద్యార్థినిని నిరాకరించడంతో గతంలో తన చేతిపై బ్లేడ్‌తో కోసుకుని గాయాలు చేసుకున్నాడు. సోమవారం కాలేజీలో విద్యార్థినిని తన ప్రేమ విషయంపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరిస్తూ కాలేజీపై అంతస్తులోని తరగతి గదిలో మర్చిపోయిన పుస్తకాలు తీసుకురావడానికి వెళ్లింది. వెనకాలే వెళ్లిన శ్రీకాంత్ ఆమెను అడ్డగించి తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో అరచెయ్యిపై కోసి పారిపోయాడు.
రక్తం మరకలతో భయపడుతూ బయటకు పరుగులు తీసిన విద్యార్థినిని గమనించిన కాలేజీ యాజమాన్యం వెంటనే స్థానిక స్వతంత్రచౌక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. తీవ్రంగా గాయం కావడంతో సుమారు ఏడు కుట్లు పడ్డాయని తెలిసింది. ఈ దాడిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా, అలాంటి సంఘటన జరగలేదని, కాలేజీలో బెంచీ తగలడంతోనే విద్యార్థిని గాయపడిందని నిర్లక్ష్యంగా చెప్పారు. విషయం తెలిసిన వన్‌టౌన్ పోలీసులు బాధిత విద్యార్థినితో మాట్లాడి వివరాలు సేకరించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 326 క్లాజ్-ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇ.పద్మ, డీపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఖండించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిర్భయ చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి
Published Tue, Dec 16 2014 2:11 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement