సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. నలంద ఇంజినీరింగ్ కాలేజిలో మూడో సంవత్సరం చదువుతున్న యశ్వంత్(22) బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.