- బ్యాక్‌లాగ్ పరీక్షకు బయలుదేరి శవమై తేలాడు
- పెట్రోలు పోసి నిప్పంటించి చంపిన దుండగులు
- ఆచూకీ తెలిపిన ఐడెంటిటీ కార్డు
ఇంజనీరింగ్ విద్యార్థి దారుణహత్య
Published Sat, Oct 29 2016 10:53 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
రాజమహేంద్రవరం రూరల్ :
ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహం పెట్రోలు పోసి కాల్చి చంపిన స్థితిలో శ్రీరామపురం సమీపంలోని కవలగొయ్యి రోడ్డులోని నిర్జన ప్రదేశంలో లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన యలమర్తి శివ వెంకటేష్ (22) రైట్ కళాశాలలో ఈసీఈ గ్రూపుతో ఇంజనీరింగ్ చదివాడు. నాలుగు సబ్జెక్టులు మిగిలిపోయాయి. పాలచర్లలోని బీవీసీ కళాశాలలో అతడు శుక్రవారం బ్యాక్‌లాగ్ పరీక్షలలో ఒకటి రాయాల్సి ఉంది.అందుకోసం అతడు శుక్రవారం ఉదయమే హాల్ టికెట్ తీసుకునేందుకు బైక్‌పై రైట్ కళాశాలకు బయలుదేరాడు. అక్కడి నుంచి అతడు బీవీసీ కళాశాలకు వెళ్లి పరీక్ష రాయాలి. శుక్రవారం రాత్రి 10 గంటలకు కూడా వెంకటేష్ ఇంటికి తిరిగి రాకపోవడం, అతడి సెల్ స్విచాఫ్ చేసి ఉండడంతో తండ్రి భాస్కరరావు కంగారు పడ్డాడు. వేమగిరి వచ్చి కుమారుడి స్నేహితులు, తెలిసిన వారి వద్ద వెతికినా లాభం లేకపోయింది. భాస్కరరావు శనివారం రైట్ కళాశాలకు వెళ్లి విచారించగా వెంకటేష్ కళాశాలకు రాలేదని, హాల్ టికెట్ తీసుకోలేదని తెలిసింది.
గుర్తుతెలియని శవం ఉందని..
ఇదిలా ఉండగా లాలా చెరువు నుంచి శ్రీరామపురం గ్రామం పరిధిలోని కవలగొయ్యి రోడ్డులో గుర్తుతెలియని శవం, ఒక బైక్, బ్యాగు ఉన్నట్టు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎస్సై కనకారావు, సిబ్బంది వెళ్లి చూడగా శవం పూర్తిగా కాలిపోయి, అడవి పందులు తినడంతో ఆనవాలు పట్టలేని స్థితిలో ఉంది. అక్కడి బ్యాగులో లభించిన రైట్ కళాశాల ఐడెంటిటీ కార్డు, సెల్‌ఫో¯ŒS ఆధారంగా మృతుడు దుళ్ళ గ్రామానికి చెందిన యలమర్తి వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. వారిచ్చిన సమాచారం భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం తమ కుమారుడిదిగా గుర్తించాడు. సంఘటన స్థలాన్ని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించి మృతుడు వెంకటేష్ తండ్రి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కిరాతకంగా హత్య
యలమర్తి శివ వెంకటేష్‌ను అతడి బైకులోని పెట్రోలు పైపు తొలగించి, పెట్రోలును అతనిపై పోసి కాల్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. అక్కడ విస్కీ బాటిల్ కూడా లభ్యమైంది. వెంకటేష్ సెల్‌కు వచ్చిన నంబర్ల ఆధారంగా ప్రేమ వ్యవహారం, స్నేహితులతో తలెత్తిన విభేదాలు అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌టీం ద్వారా సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.వెంకటేష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని, కారణాలు తెలుసుకుని తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement