ప్రియాంక కళాశాలలో ఇచ్చిన సెలవు చీటి, ప్రియాంక (ఫైల్)
చిత్తూరు, కురబలకోట: విద్యార్థినుల బలవన్మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థిని గీతిక తనువు చాలించి రెండు రోజులు గడవకమునుపే మరో విద్యాసుమం రాలిపోయింది. అంగళ్లులో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియనప్పటికీ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొనాల్సిన విద్యావంతులు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. విద్యాసంస్థల్లో తక్షణ కౌన్సెలింగ్ అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అంగళ్లు సమీపాన ఇంజినీరింగ్ కశాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ప్రియాంక తన స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం పట్నంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ సంఘటన ఇక్కడి విద్యార్థులను విషాదంలో ముంచింది. ర్యాగింగ్, ఈ వ్‌టీజింగ్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రి యాంక తండ్రి నగేష్ అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రూరల్ సీఐ రమేష్, ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య విచారణ జరిపారు. ఆమె చదువుతున్న మండలంలోని ఇంజినీరింగ్ కళాశాలలో వి ద్యార్థులను, యాజమాన్యాన్ని విచారించా రు. హాస్టల్‌ను సందర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అడిగి తెలుసుకున్నారు.
ప్రియాంక కలివిడిగా మసలుకునేదని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈమె తండ్రి ఆటోడ్రైవర్. కళాశాల ఉచితంగా హాస్టల్ వసతి కల్పించినట్లు యాజమాన్యం చెబు తోంది. ర్యాగింగ్ జరగలేదని పోలీసులకు యాజమాన్యం వివరించింది. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ర్యాగింగ్ ఎదురుకాదని పేర్కొనట్లు భోగట్టా. వ్యక్తిగత అంశాలపై పోలీసులు ఆరా తీశారు. తాతకు బాగలేదని మంగళవారం ప్రియాంక కళాశాలకు సెలవు పెట్టింది. కళాశాల హాస్టల్‌నుంచి సోమవారం సాయంత్రం కళాశాల బస్సులోనే కదిరి వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటిలో చనిపోయింది. విచారణ జరపాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మంగళవారం కళాశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment