ragging death
-
చెదిరిన కల.. ర్యాగింగ్ రోగానికి బలి
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఒత్తిళ్లు, హోం సిక్ తదితర కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. అదే సమయంలో విద్యాలయాల్లో ‘ర్యాగింగ్ విష పురుగులు’ రెచ్చిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ర్యాగింగ్ రోగం ఓ అమాయకుడి జీవితాన్ని చిదిమేసింది. సీనియర్లంతా కలిసి గే అని ప్రచారం చేయడంతో.. ఆ మరకను తట్టుకోలేకపోయాడతను. భరించలేక హాస్టల్ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణం విడిచాడు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేపిన ర్యాంగింగ్ మరణంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. Jadavpur University ragging: కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్లో చేరిన స్వప్నదీప్ కుండూ(18).. బుధవారం అర్ధరాత్రి హాస్టల్ బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద సౌండ్ రావడంతో విద్యార్థులు బయటికి వచ్చి చూడగా.. నగ్నంగా రక్తపు మడుగులో పడి కనిపించాడు. దీంతో కేపీసీ మెడికల్ కాలేజీకి తరలించగా.. గురువారం వేకువ ఝామున కన్నుమూశాడు. అదే రోజు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. నేను గే కాదు.. బిల్డింగ్ మీద నుంచి దూకే ముందు స్వప్నదీప్ ‘నేను గే కాదు.. నేను గే కాదు’’ అంటూ అరుస్తూ దూకినట్లు కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో స్వప్నదీప్‌ను హాస్టల్లో ఉన్న సీనియర్లు కొందరు ర్యాగింగ్ చేశారని.. ఫలితంగానే స్వప్నదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాని పోలీసులు తేల్చారు. స్వప్నదీప్‌ను గేగా సీనియర్లు ప్రచారం చేశారని, తోటి విద్యార్థుల ముందు అవమానించారని.. ఘటన జరిగిన రాత్రి అతని దుస్తులిప్పించి మరో విద్యార్థి గదికి వెళ్లాలంటూ బలవంతం చేశారని ర్యాగింగ్ బాధితులు మరికొందరు పోలీసులకు చెప్పారు. కోర్సు ముగిసినా.. దేశంలోని చాలా యూనివర్సిటీల్లో ఉండే సమస్య జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనూ ఉంది. తమ తమ కోర్సులు ముగిసినా.. కొందరు మాజీలు హాస్టల్లోనే కొనసాగడం!. ఎమ్మెస్సీ పూర్తి చేసిన సౌరభ్ చౌదరి ఇదే కోవకి చెందిన వ్యక్తి. బయట ఉద్యోగం చేస్తూ క్యాంపస్ హాస్టల్లో ఉండడమే కాకుండా.. జూనియర్ల మీద ర్యాగింగ్ పేరుతో ప్రతాపం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వప్నదీప్‌ను ర్యాగింగ్ చేయడంతో.. అతను అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సౌరభ్ సైతం తాను నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు కూడా. దీంతో ఐపీసీ సెక్షన్ 302/34 కింద కేసు నేరాభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. శనివారం(ఇవాళ) సౌరభ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. పుత్రశోకంలో.. నదియా బోగుల ఏరియాకు చెందిన స్వప్నదీప్ జాదవ్ అలియాస్ గోపాల్. స్వప్నదీప్ స్కూల్లో బ్రైట్ స్కూడెంట్. పాఠాన్ని ఒక్కసారి వింటే పట్టేస్తాడు. లక్షల్లో ఒక్కడు అనే ట్యాగ్ లైన్ ఉంది అతనికి. అంత బాగా చదివే విద్యార్థి ఇలా అర్థాంతంరంగా.. అదీ ర్యాంగింగ్ వల్ల చనిపోవడాన్ని తోటి విద్యార్థులు, అతనికి పాఠాలు నేర్పిన గురువులు తట్టుకోలేకపోతున్నాయి. పైగా యూనివర్సిటీలో స్వప్నదీప్ చేరి వారం కూడా కాలేదు. ఆగష్టు 6వ తేదీన తండ్రి హాస్టల్లో దిగబెట్టి వచ్చాడు. ఈ వారంరోజుల్లో.. క్లాసులు జరిగిన మూడు రోజులూ హాజరయ్యాడు. ఈలోపే ఆ తల్లిండ్రుల కలలు చెల్లాచెదురు అయ్యాయి. కొడుకు జీవితంలో ఎదిగి తమకు ఆసరాగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. తల్లి స్వప్న కొడుకు చిన్ననాటి ఫొటోలు పట్టుకుని గుండెలు బద్ధలయ్యేలా ఏడుస్తోంది. కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడనే నిజాన్ని.. కన్నీళ్లను దిగమింగుకుని స్వప్నదీప్ తండ్రి రాంప్రసాద్.. భార్యను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అగ్నిగుండంగా జేయూ.. ప్రెషర్ స్టూడెంట్ స్వప్నదీప్ ఆత్మహత్య ఘటన ఉదంతంతో జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఉలిక్కి పడింది. సీనియర్ల ఘాతుకాలను బయటపెడుతూ మరికొందరు ముందుకు వచ్చారు. విద్యార్థి సంఘాలు ఘటనను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టాయి. ఓ విద్యార్థి బంగారు భవిష్యత్తును చిదిమేసిన ర్యాంగింగ్ భూతాన్ని అణచివేయాలని.. ఘటనకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి ప్రొఫెసర్లు సైతం మద్దతు ప్రకటించడం గమనార్హం. మరోవైపు ర్యాంగిగ్ ఫ్రీ క్యాంపస్‌గా జాదవ్‌పూర్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అక్కడ. ఇక.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సైతం క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులతో చర్చలు జరిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారాయన. అంతేకాదు స్వప్నదీప్ కుటుంబాన్ని ఫోన్లో సైతం పరామర్శించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
పడగవిప్పిన ర్యాగింగ్ భూతం.. ఎన్నో ఆశలతో కాలేజ్‌కి వచ్చి..
వికృత ఆనందం మరోసారి పడగ విప్పింది. ర్యాగింగ్ భూతం పేరిట విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయమే వారిపాలిట మృత్యు పాశంగా మారింది. దీంతో మరో కుటుంబానికి గర్భశోకం మిగిలింది. ఈ సెగలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అసెంబ్లీని సైతం కుదిపేశాయి. దీనిపై విచారణకు నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక కమిటీని నియమించారు. భువనేశ్వర్: రాష్ట్ర రాజధాని నగరంలోని బక్షి జగబంధు(బీజేబీ) కళాశాల క్యాంపస్‌లో విద్యార్థి రుచికా మహంతి(19) ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. కళాశాల ఆవరణ నుంచి శాసనసభ వరకు ఆందోళన సెగలు విస్తరించాయి. రుచికా కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ అమానుష చర్య విద్యార్థి సంఘాలు నిరసనకు దిగేలా చేశాయి. ఈ విచారకర పరిస్థితులను తొలగించేందుకు ప్రభుత్వం ఇంకెంత కాలం నిరీక్షిస్తుందని నిలదీస్తున్నాయి. రుచికా మహంతి ఆత్మహత్యకు ప్రేరేపించిన ర్యాగింగ్ వేధింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు చేపడతామని కళాశాల యాజమాన్యం, పోలీస్ కమిషనరేట్ వర్గాలు యథాతధంగా భరోసా ఇస్తున్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరి తరహాలో వారు ప్రత్యేక కమిఈలు ఏర్పాటు చేసి, విచారణ చేపట్టినట్లు సోమవారం ప్రకటించాయి. తల్లిదండ్రుల నిరసన.. విద్యార్థి రుచికా మహంతి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ చర్యలకు నిరసనగా ఆమె తల్లిదండ్రులు, కటుంబీకులు కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించి, ధర్నాలో పాల్గొన్నారు. కటక్ జిల్లా అఠొగొడొ ప్రాంతం నుంచి బీజేబీ కళాశాల ఆర్ట్స్ విభాగం ప్లస్3 డిగ్రీ తొలి సంవత్సరం తరగతిలో రుచికా మహంతి ఇటీవల చేరింది. కళాశాల కరుబాకి హాస్టల్ 201వ నంబర్ గదిలో శనివారం రాత్రి ఉరి పోసుకుని మరణించినట్లు గుర్తించారు. ఆమె మరణ వాంగ్మూలం పోలీసులు గుర్తించినట్లు 4వ నంబర్ జోన్ ఏసీపీ పరేష్రౌత్ తెలిపారు. ముగ్గురు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈ వాంగ్మూలంలో వివరించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల పేర్లు ఇతర వివరాలను పేర్కొనలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కళాశాల విచారణ కమిటీ.. రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ పురస్కరించుకుని ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. కళాశాల యాజమాన్యం దీనిని నియమించింది. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అన్ని విభాగాల అధ్యాపకులతో ఏర్పాటు చేశారు. ర్యాగింగ్‌కు సంబంధించి రుచికా మహంతి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. త్వరలో ఈ విచారకర ఘటన పూర్వాపరాలు వెలుగు చూస్తాయని బీజేబీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన మిశ్రా తెలిపారు. మరోవైపు ప్లస్3 డిగ్రీ చివరి సంవత్సరపు పరీక్షలను నిలిపి వేశారు. సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలలో నెలకొన్న ఉధ్రిక్తతతో సోమవారం, మంగళవారాల్లో జరగాల్సిన పరీక్షలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు సీనియర్ విద్యార్థులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘం, విద్యార్థిని కుటుంబీకులు నిరసన వ్యక్తం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో.. రుచికా మహంతి ఆత్మహత్య ఘటన పురస్కరించుకుని విద్యార్థి కాంగ్రెస్ సోమవారం ఆందోళనకు దిగింది. ర్యాగింగ్ నివారణలో ప్రభుత్వ వైఫల్యమైందని నినాదాలతో శాసనసభలోకి చొరబడేందుకు ఆందోళనకారులు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉధ్రిక్తత నెలకొంది. కమిషనర్ ఆధ్వర్యంలో.. బీజేబీ కళాశాల క్యాంపస్ కరిబాకి హాస్టల్ గదిలో విద్యార్థి రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. డీïసీపీ హోదా అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో దీనిపై విచారణ చేపడుతుందని జంట నగరాల పోలీసు కమిషనర్ సౌమేంద్రకుమార్ ప్రియదర్శి వెల్లడించారు. మరోవైపు స్థానిక బర్గడ్ ఠాణా పోలీసులు ఈ సంఘటన పురస్కరించుకుని ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. స్పందించిన హక్కుల కమిషన్ భువనేశ్వర్: స్థానిక బక్షి జగబంధు(బీజేజీ) కళాశాల క్యాంపస్ హాస్టల్ గదిలో ప్లస్3 డిగ్రీ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య సంఘటన పురస్కరించుకుని సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఒడిశా మానవ హక్కుల కమిషనప్ సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్లో నివేదిక దాఖలు చేయాలని కటక్–భువనేశ్వర్ జంట నగరాల కమిషరేటు పోలీస్ వర్గాలకు కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసినట్లు తెలిపింది. మీడియా ప్రసారం ఆధారంగా ఒడిశా మానవ హక్కుల కమిషన్ స్వయంగా చొరవ కల్పించుకుని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. నిందితుల్ని క్షమించేది లేదు: హోంశాఖ భువనేశ్వర్: బీజేబీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన పట్ల రాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి తుషార్‌కాంతి బెహరా సోమవారం స్పందించారు. నిందితుల్ని క్షమించేది లేదని ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టిన వివరణలో పేర్కొన్నారు. విపక్షాల దాడితో ఈ ఘటనపై వివరణ సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ విక్రమకేశరి అరూఖ్ ఆదేశించారు. సభా కార్యక్రమాలు ముగిసే సమయానికి వివరణ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తుషార్‌కాంతి బెహరా మాట్లాడుతూ... ‘విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య అత్యంత విచారకరం. పోలీసులు ఈ ఘటన పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది’ అని ప్రకటించారు. దీనిపై బర్గడ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కోసం కమిషనరేట్ పోలీసు 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అదనపు డీసీపీ హోదా అధికారి ఈ బృందాలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబీకులు, మృతురాలి బంధువర్గం జారీ చేసిన సమాచారం, ఘటనా స్థలంలో లభ్యమైన మరణ వాంగ్మూలం వివరాలను దర్యాప్తు పరిధిలో ప్రధాన అంశాలుగా పరిగణించినట్లు మంత్రి తెలిపారు. సభలో సమరమే..! ర్యాగింగ్ తీవ్రతతో బీజేబీ కళాశాలలో విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనాత్మకంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఈ విచారకర పరిస్థితుల పట్ల పూర్తి వివరణ సభలో ప్రవేశ పెట్టాలని సోమవారం జరిగిన వర్షాకాల సమావేశాల్లో సభ్యులు విరచుకు పడ్డారు. స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. విపక్షాల తీరుపట్ల అసహనం ప్రదర్శించిన స్పీకర్.. సభా కార్యక్రమాలను ఉదయం 11.30 గంటల వరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో సభలో ప్రశ్నోత్తరాల ఘట్టానికి గండి పడింది. జీరో అవర్‌లో దీనిపై చర్చిద్దామని సభాపతి విక్రమకేశరి అరూఖ్ సభ్యుల్ని అభ్యర్థించారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగనీయాలన్న స్పీకర్ పిలుపుని నిరాకరించడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు గుర్తించి, సభా కార్యక్రమాలను వాయిదా వేశారు. -
ర్యాగింగ్‌కు రాలిన విద్యాకుసుమం
కర్ణాటక,యశవంతపుర: వర్శిటీలో ర్యాగింగ్ వేధింపులు భరించలేక ప్రతిభావంత విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు యలహంక పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గౌరిబిదనూరుకు చెందిన గగన్ (21) బెంగళూరు వ్యవసాయ వర్సిటీ (జీకేవీకే)లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్టియర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లోని సీనియర్ విద్యార్థులు నిత్యం ర్యాగింగ్ పేరుతో గగన్‌ను నానా విధాలుగా వేధిస్తున్నారు. దీనితో విరక్తి కలిగిన గగన్ మంగళవారం రాత్రి జీకేవీకే సమీపంలోని రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టెన్త్, పీయుసీలో అత్యధిక మార్కులతో పాసైన గగన్‌కు జీకేవీకేలో ఉచితంగా బీఎస్సీ సీటు వచ్చిందని అతని మామ మల్లేశ్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రియాంకా.. ఎందుకిలా చేశావ్ ?
చిత్తూరు, కురబలకోట: విద్యార్థినుల బలవన్మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థిని గీతిక తనువు చాలించి రెండు రోజులు గడవకమునుపే మరో విద్యాసుమం రాలిపోయింది. అంగళ్లులో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియనప్పటికీ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొనాల్సిన విద్యావంతులు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. విద్యాసంస్థల్లో తక్షణ కౌన్సెలింగ్ అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అంగళ్లు సమీపాన ఇంజినీరింగ్ కశాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ప్రియాంక తన స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం పట్నంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇక్కడి విద్యార్థులను విషాదంలో ముంచింది. ర్యాగింగ్, ఈ వ్‌టీజింగ్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రి యాంక తండ్రి నగేష్ అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రూరల్ సీఐ రమేష్, ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య విచారణ జరిపారు. ఆమె చదువుతున్న మండలంలోని ఇంజినీరింగ్ కళాశాలలో వి ద్యార్థులను, యాజమాన్యాన్ని విచారించా రు. హాస్టల్‌ను సందర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక కలివిడిగా మసలుకునేదని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈమె తండ్రి ఆటోడ్రైవర్. కళాశాల ఉచితంగా హాస్టల్ వసతి కల్పించినట్లు యాజమాన్యం చెబు తోంది. ర్యాగింగ్ జరగలేదని పోలీసులకు యాజమాన్యం వివరించింది. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ర్యాగింగ్ ఎదురుకాదని పేర్కొనట్లు భోగట్టా. వ్యక్తిగత అంశాలపై పోలీసులు ఆరా తీశారు. తాతకు బాగలేదని మంగళవారం ప్రియాంక కళాశాలకు సెలవు పెట్టింది. కళాశాల హాస్టల్నుంచి సోమవారం సాయంత్రం కళాశాల బస్సులోనే కదిరి వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటిలో చనిపోయింది. విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మంగళవారం కళాశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. -
మేఘన ర్యాగింగ్ వీడియో హల్చల్
యశవంతపుర : ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని మేఘనను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలో బయటపడ్డాయి. దీంతో కర్ణాటక మహిళ కమిషన్ మేఘన ఆత్మహత్య కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. గురువారం ఉదయం మేఘన ను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. మొదట మేఘన ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్న దయానంద సాగర కళాశాల యాజమాన్యం, కళాశాల ఆవరణలో మధ్యాహ్నం మేఘనను తోటి విద్యార్థిని, విద్యార్థులు అవమానంగా మాట్లాడటం, దుర్భాషలాడటం, దాడి చేయడానికి యత్నించిన వీడియోలు బయటపడ్డాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి మొబైళ్లను తీసుకుని పరిశీలించగా ర్యాగింగ్ దృశ్యాలు బయటపడినట్లు విచారణలో తేలింది. దీంతో మేఘన తల్లిదండ్రులకు బలం చేకూరింది. మేఘన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థినిని అమర్యాదగా మాట్లాడటం సిగ్గుచేటు: మహిళా కమిషన్ చైర్పర్సన్ తోటి విద్యార్థినిని సహచరులే అమర్యాదగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి అన్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
విద్యార్థి ఆత్మహత్యపై.. పోలీసు విచారణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థి మధువర్ధనరెడ్డి ఆత్మహత్యపై అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు శనివారం కళాశాలలో విచారణ నిర్వహించారు. ర్యాగింగ్ వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. తొలుత కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు, ముత్తుకూరు ఎస్సై శ్రీనివాసరెడ్డిలతో ఆత్మహత్య ఘటనపై చర్చించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్, క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి, రూమ్మేట్స్ను విడివిడిగా విచారించారు. విచారణ పూర్తయితేనే వివరాలు వెల్లడవుతాయని డీఎస్పీ రామాంజనేయులు విలేకరులతో చెప్పారు. మధువర్ధన్‌రెడ్డి నిద్రిస్తుండగా సీనియర్ విద్యార్థులు దుప్పటి కప్పి తీవ్రంగా కొట్టినట్టు తండ్రి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. శ్రీగాయత్రి కళాశాల విద్యార్థి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసి వివిధ ప్రాంతాల నుంచి శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పిడతాపోలూరుకు చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నారు. -
ఆత్మహత్య!