తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మాకా ఫణికుమార్ (21) స్థానిక వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఈక్రమంలో ఈ రోజు సాయిబాబా గుడి సమీపంలోని ప్రధాన కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి.... ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఫణికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... ఫణికుమార్ కోసం గాలిస్తున్నారు.