గోమతి నగర్‌లో బీటెక్ విద్యార్థిని దారుణంగా హతమార్చిన ఘటనలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే షంషేర్ బహదూర్ కుమారుడి ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమన్ బహదూర్ సహా మిగతా నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు.. స్నేహితుడిని కలవడానికి ప్రశాంత్ సింగ్ (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థి కారులో గురువారం సాయంత్రం గోమతి నగర్‌కు వెళ్లాడు.